ఏటీఎం చోరీకి యత్నించి దొరికిపోయారు

ఏటీఎం చోరీకి యత్నించి  దొరికిపోయారు

శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని రాల్లగూడ రోడ్ లోని యూనియన్ బ్యాంకులోని ఏటీఎం చోరీకి ఇద్దరు దుండగులు ప్రయత్నించారు. బుధవారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఓ  వ్యక్తి ఏటీఎంలోకి ప్రవేశించారు. మోఖానికి మాస్క్  కప్పుకొని ఏటీఎం మెషిన్ ని ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు. సౌండ్ బయటకు రాకుండా ఉండేందుకు షెటర్ మూసివేశారు. ఓ ఏటీఎం మెషిన్, మరో డిపాజిటర్ ను ద్వంసం చేశారు. 

ఈ క్రమంలో సెక్యూరిటీ అలారం మోగడంతో బ్యాంక్ ముందు ఉన్న ఇంటి యజమాని నిద్ర లేచి చూడగా ఏటీఎం సెంటర్ స్వెటర్ మూసి ఉంది. దీంతో  అనుమానం వచ్చిన ఇంటి యజమాని వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. ఎయిర్ పోర్ట్ పోలీసులు యూనియన్ బ్యాంక్ దగ్గరకి చేరుకొని చోరీకి యత్నించిన నిందితునితో పాటు మరో వ్యక్తిని  అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ స్టేషన్ తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పక్కా ప్లాన్ తోనే వారిరువురు ఏటీఎంలో డబ్బు దొంగలించడానికి వచ్చారని పోలీసుల విచారణలో తేలింది.