
ఓ ఇద్దరు స్నేహితులు జాక్‌పాట్ కొట్టారు. రూ.100 పెట్టి లాటరీ టికెట్ కొంటే ఏకంగా కోటిన్నర రూపాయలు తగిలాయి. ఈ ఘటన పంజాబ్‌లోని ఫాజిల్కా జిల్లాలో చోటుచేసుకుంది. అబోహర్ పట్టణానికి చెందిన రమేశ్, కుకీస్నేహితులు. వీరిద్దరూ గతకొంతకాలంగా లాటరీ టికెట్లు కొంటున్నారు. అప్పుడప్పుడు రూ. 45 వేలు రూ. 20 వేలు ఇలా చిన్న మొత్తాలు గెలుచుకున్నారు.
Also Read :- ఢిల్లీ లిక్కర్ కేసు.. ఆప్ ఎంపీ ఇంటిపై దాడులు
కానీ కోటిన్నర గెలుచుకోవడం ఇదే మొదటిసారి. కోటి రూపాయలు గెలుచుకోవడంతో వారి అనందానికి అవధులు లేవు. మిత్రులిద్దరూ బ్యాండ్ మేళాతో డ్యాన్స్ చేశారు. పట్టణంలోని కొత్త కోటీశ్వరులతో ఫోటోలు వైరల్ గా మారాయి. లాటరీ డబ్బును తమ పిల్లల కోసం, కొన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఖర్చు చేస్తామని రమేశ్, కుకీ తెలిపారు. జోగిందర్‌కు చిన్న దుస్తుల దుకాణం ఉంది మరియు లాటరీ టిక్కెట్లు అమ్మేవాడు