వర్ధన్నపేట, వెలుగు : వర్ధన్నపేట మండలం ఇల్లంద శివారులో వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై రెండు ఇసుక ట్రాక్టర్లు ఆదివారం ఢీకొన్నాయి. మార్కెట్ యార్డ్ మూల మలుపు వద్ద ఈ ప్రమాదం జరిగింది.
డ్రైవర్లకు స్వల్ప గాయాలయ్యాయి. వర్థన్నపేట మండల పరిధిలోని ఆకేరు వాగు నుంచి ఇసుక రవాణా జరుగుతోంది. తరచూ ప్రమాదాలతో స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు.