
ఎల్బీనగర్, వెలుగు: చార్మినార్ పోలీస్ స్టేషన్ పరిధిలో షార్ట్ సర్క్యూట్ కారణంగా రెండు షాపుల్లో అగ్నిప్రమాదం జరిగింది. చోక్ క్లాక్ టవర్ సమీపంలోని ముర్గీ చోక్ వద్ద ఏ1 స్వీట్ షాపులో షార్ట్ సర్క్యూట్తో మంటలు లేచి షాపంతా దగ్ధమైంది. మంటలు పక్కనే ఉన్న ఎస్ కే ఆప్టికల్ షాపునకు వ్యాపించడంతో అందులోనూ సామగ్రి కాలిపోయింది. మోగులపుర, చందులాల్ బరాడారి ఫైర్ స్టేషన్ల నుంచి ఫైర్ ఇంజిన్లు వచ్చి మంటలను ఆర్పేశాయి. ఈ అగ్నిప్రమాదంలో సుమారు రూ.8 లక్షల ఆస్తినష్టం వాటిల్లింది.