సొంత జిల్లాకు బదిలీ చేయించుకున్న ఇద్దరు టీచర్లు

సొంత జిల్లాకు బదిలీ చేయించుకున్న ఇద్దరు టీచర్లు
  • రూలింగ్​ పార్టీ లీడర్ల అండతో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు
  • రెగ్యులర్​ డీఈవో లేకున్నా ఇన్‌‌‌‌చార్జితో ప్రొసీడింగ్‌‌‌‌లపై సంతకాలు
  • భూత్పూర్​, ధర్మాపూర్​లో పోస్టింగుల కోసం పైరవీలు

మహబూబ్​నగర్​, వెలుగు : రాజకీయ పలుకుబడిని ఉపయోగించి ఇద్దరు టీచర్లు అక్రమంగా బదిలీలు చేసుకున్నారు. అధికార పార్టీకి చెందిన అనుబంధ సంఘానికి వీరు లీడర్లు కావడంతో ఎడ్యుకేషన్​ ఆఫీసర్లు కూడా ఇందుకు సహకారం అందించారు. రెగ్యులర్​ డీఈవో లీవ్‌‌‌‌‌‌‌‌లో ఉండగా.. ఇన్​చార్జి ఆఫీసర్​తో సంతకాలు చేయించుకొని సొంత జిల్లాకు ట్రాన్స్​ఫర్​ అయినట్లు ప్రొసిడింగ్‌‌లు తెచ్చుకున్నారు.

ట్రాన్స్‌‌‌‌‌‌‌‌ఫర్ అయ్యాక పైరవీలు

జీవో 317 జారీ కాకముందు మహబూబ్​నగర్​ జిల్లాకు చెందిన నారాయణగౌడ్ పాలకొండ యూపీఎస్​లో ఎస్.రఘురాంరెడ్డి ఏనుగొండ జడ్పీహెచ్​ఎస్​లో టీచర్లుగా డ్యూటీలు చేసేవారు. ప్రభుత్వం గతేడాది జీవో 317 తీసుకురావడంతో వీరిలో నారాయణగౌడ్​ నారాయణపేట జిల్లా మాగనూరు మండలం గూడెబల్లూర్​లోని జడ్పీహెచ్​ఎస్​కు, రఘురాంరెడ్డి నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం మొగల్​ మడ్కలోని జడ్పీహెచ్​ఎస్​కు ట్రాన్స్​ఫర్​ అయ్యారు.  అప్పటి నుంచి వీరు సొంత జిల్లాకు వచ్చేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఇందులోభాగంగా పాలమూరు జిల్లాకు చెందిన రూలింగ్​ పార్టీ లీడర్​ అండతో పైరవీలు చేశారు.  ఈ క్రమంలోనే డైరెక్టర్ ​ఆఫ్ స్కూల్​ఎడ్యుకేషన్​ నుంచి జూలై 30న మెమో జారీ చేశారు.  అదే రోజు నారాయణపేట జిల్లా డీఈవోకు డీఎస్సీ ఉత్తర్వులు జారీ చేసి, రిలీవ్​ కూడా చేశారు. అంతేకాదు అధికార పార్టీ లీడర్లు, ఎమ్మెల్సీల ద్వారా పాలమూరు జిల్లాలోని భూత్పూర్, ధర్మాపూర్​లలో పోస్టింగ్​ తీసుకోవడానికి ఇప్పటికే పైరవీలు ప్రారంభించినట్లు సమాచారం. 

జూనియర్లైనా ట్రాన్స్​ఫర్లు చేశారు 

2009లో జిల్లాకు చెందిన దాదాపు 170 మంది బయో సైన్స్​లో టీచర్లు ప్రమోషన్లు పొందారు.  జీవో 317 ప్రకారం వీరందరిని సొంత జిల్లాలకు అలాట్​ చేయాలి. కానీ, వీరిలో 60 శాతం  మందినే సొంత జిల్లాలకు కేటాయించి, మిగతా వారిని సెకండ్​ ఆప్షన్​లో ఉన్న జిల్లాలకు పంపారు.  అయితే, ప్రస్తుతం ట్రాన్స్​ఫర్​ లెటర్లు తీసుకున్న ఈ ఇద్దరికన్నా ముందు దాదాపు వందమంది ఉన్నారు. పైగా వీరిద్దరికి 2011లో ప్రమోషన్లు వచ్చాయి.  ట్రాన్స్​ఫర్ల విషయంలో సీనియర్లను కాకుండా జూనియర్లుగా ఉన్న వీరిని సొంత జిల్లాలకు ట్రాన్స్​ఫర్​ చేశారు. ఈ జీవోకు సంబంధించి 13 జిల్లాలకు సబంధించిన స్పౌజ్​ కేసులు ఉన్నాయి. అందులో పాలమూరు జిల్లా కూడా ఉంది. అలాగే విడోస్​, సీనియర్లను జూనియర్లుగా, జూనియర్లను సీనియర్లుగా జరిగిన మిస్టేక్స్​ ఇంకా పెండింగ్​లోనే ఉన్నాయి. వీటన్నిటిని పరిష్కరించకుండా, జీవోకు యాంటీగా వీరిద్దరికి అక్రమంగా ట్రాన్స్​ఫర్స్​ చేయడంపై టీచర్​ యూనియన్ లీడర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సపోర్టింగ్ ఆర్డర్లు ఉన్నందునే సంతకాలు

కాగా, నారాయణపేట డీఈవో 15 రోజులుగా లీవ్​లో ఉన్నారు. ఆయన స్థానంలో ఆఫీస్​లో ఎఫ్‌‌వోగా ఉన్న మంజులకు ఇన్​చార్జి డీఈవో బాధ్యతలు అప్పగించారు. ఈ విషయంపై సోమవారం ఆమె వివరణ కోరగా, గవర్నమెంట్​ నుంచి వచ్చిన ఉత్తర్వుల ప్రకారమే ఆర్డర్లు ఇచ్చినట్లు తెలిపారు. సపోర్టింగ్​ ఆర్డర్లు ఉన్నందుకే సంతకాలు పెట్టినట్లు వివరణ ఇచ్చారు.