విహారయాత్రకు వెళ్లి వస్తుండగా.. ప్రైవేట్ బస్సును ఢీ కొన్న రెండు టూరిస్ట్ బస్సులు

విహారయాత్రకు వెళ్లి వస్తుండగా.. ప్రైవేట్ బస్సును ఢీ కొన్న రెండు టూరిస్ట్ బస్సులు

ఏపీ రాజమండ్రిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.   దివాన్ చెరువు దగ్గర జనవరి 20న రాత్రి ప్రైవేట్ ట్రావెల్ బస్సును  మరో రెండు టూరిస్ట్ బస్సులు ఢీ కొన్నాయి.  ఈ ప్రమాదంలో పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి.

అసలేం జరిగిందంటే.. నల్లగొండ జిల్లా గుండ్లపల్లి మోడల్ ప్రభుత్వ పాఠశాల, కళాశాలకు చెందిన 9వ,10వ తరగతి, ఇంటర్ విద్యార్థులు, టీచర్లు, సిబ్బంది   రెండు బస్సుల్లో ఏపీకి విహారయాత్రకు వెళ్లారు.  అరకు, పాడేరు ప్రాంతాల్లో మూడు రోజుల పాటు పర్యటించి తిరిగి వస్తున్నారు.  

ముందు వెళ్తోన్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు గేదె అడ్డు రావడంతో సడెన్ బ్రేక్ వేశాడు. దీంతో విద్యార్థులు వెళ్తోన్న రెండు బస్సులు ట్రావెల్ బస్సును వెనుక‌ నుంచి  ఢీ కొన్నాయి. ఈ  ఘటనలో 26 మంది విద్యార్థులకు గాయాలు,  స్టాఫ్ తో పాటు స్టూడెంట్స్ కి స్వల్పగాయలు  అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టి గాయాలైన వారిని ఆస్పత్రులకు తరలించారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.