పుల్వామాలో ఎన్‌‌కౌంటర్.. ఇద్దరు టెర్రరిస్టులు హతం

పుల్వామాలో ఎన్‌‌కౌంటర్.. ఇద్దరు టెర్రరిస్టులు హతం

పుల్వామా: సెక్యూరిటీ ఫోర్సెస్ ఇద్దరు టెర్రరిస్టులను మట్టుబెట్టాయి. దక్షిణ కశ్మీర్‌‌, పుల్వామాలోని టికెన్ గ్రామంలో ఇద్దరు నుంచి ముగ్గురు ఉగ్రవాదులు దాక్కున్నారన్న సమాచారం పోలీసులకు అందింది. దీంతో సీఆర్పీఎఫ్ బలగాలతో కలసి పోలీసులు సోదాలు చేపట్టారు. సెక్యూరిటీ ఫోర్సెస్‌‌ సదరు విలేజ్‌‌లోకి రాగానే ఉగ్రవాదులు కాల్పులకు దిగారు. దీంతో భద్రతా దళాలు ఎదురుకాల్పులను ప్రారంభించాయి. ఈ ఎన్‌‌కౌంటర్‌‌లో ఇద్దరు గుర్తు తెలియని టెర్రరిస్టులను మట్టుబెట్టామని జమ్మూ కశ్మీర్ పోలీసు శాఖ ప్రతినిధి చెప్పారు. ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందన్నారు. ఒక్క రోజు వ్యవధిలో పోలీసులు మూడో ఆపరేషన్ చేపట్టారు. మరో రెండు ఆపరేషన్లు నార్త్ కశ్మీర్‌లో జరిగాయి.