ఆకాశంలో ఢీకొన్న రెండు శిక్షణ విమానాలు
ఇద్దరు పైలట్లు మృతి.. కొలంబియాలో ఘటన
బొగోటా (కొలంబియా) : కొలంబియా ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన రెండు యుద్ధ విమానాలు ఆకాశంలో ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు పైలట్లు మృతి చెందారు. జులై 1న అపియాప్ ఎయిర్ బేస్‌లో జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సెంట్రల్ కొలంబియా మెటాలోని అపియామ్ ఎయిర్‌బేస్‌లో రెండు ఫైటర్ విమానాలు శిక్షణ కార్యక్రమంలో భాగంగా ఆకాశంలో ఎగురుతున్నాయి.
అన్ని విమానాలు సర్కిల్‌లో వెళ్తుండగా, రెండు టీ–27 టునాకో ఎయిర్‌క్రాఫ్ట్ లు ప్రమాదవశాత్తు ఢీకొనడంతో మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో ఆ రెండు విమానాలు నేలకూలాయి. ఈ ఘటనలో ఇద్దరు పైలట్లు అక్కడికక్కడే మృతి చెందారని ఎయిర్‌బేస్ ఉన్నతాధికారులు వెల్లడించారు.
