
గచ్చిబౌలి/ఘట్కేసర్, వెలుగు : పనికి వెళ్లిన యువతి కనిపించకుండా పోయిన ఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన శ్రీరాములు కుటుంబంతో కలిసి గచ్చిబౌలి సుదర్శన్‌నగర్‌లో ఉంటున్నాడు. ఇతని కూతురు సాయిశ్రావణి(19) మజీద్‌బండలోని ఓ అపార్ట్మెంట్లో హౌస్ కీపింగ్ పనిచేస్తుంది.
ఈ నెల 30న ఉదయం ఇంటి నుంచి బయలుదేరిన సాయిశ్రావణి డ్యూటీకి వెళ్లలేదు. సాయంత్రమైన ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు చుట్టుపక్కల, బంధువుల వద్ద వెతికారు. ఆచూకీ దొరకకపోవడంతో గురువారం గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్‌కేసు నమోదు చేశారు.
ఘట్కేసర్లో మైనర్..
ఘట్కేసర్మున్సిపాలిటీ పరిధిలోని అంబేద్కర్ నగర్‌కు చెందిన ముక్ర శ్లోక(17) గతేడాది టెన్త్క్లాస్పూర్తిచేసింది. తరచూ ఫిట్స్ వస్తుండడంతో ఏడాదిగా ఇంటి వద్దే ఉంటోంది. గత నెల 31న సాయంత్రం స్థానిక షాపునకు వెళ్లిన శ్లోక తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు ఎంత వెతికినా ఆచూకీ దొరకలేదు. గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదైంది.