
హైదరాబాద్, వెలుగు: తన ఫీచర్ ఫోన్ యూజర్ల కోసం రిలయన్స్ జియో టెలికం కొత్త ఆఫర్‌ను ప్రకటించింది. రూ.రెండు వేలు చెల్లిస్తే జియో ఫీచర్ ఫోన్‌తోపాటు రెండేళ్లదాకా అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, డేటా యాక్సెస్ ఇస్తారు. రూ.1,500 చెల్లిస్తే ఫోన్‌తోపాటు ఏడాదిపాటు కాల్స్, నెలకు 2జీబీ డేటా ఇస్తారు. ఇది వరకే ఫోన్ కొన్న యూజర్లు రూ.749తో రీచార్జ్ చేసుకుంటే ఏడాది పాటు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, డేటా యాక్సెస్ పొందవచ్చు. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి రిలయన్స్ రిటైల్, జియో రిటైలర్ల నుంచి ఈ ఆఫర్‌ను పొందొచ్చు.