
హైదరాబాద్: కుత్బుల్లాపూర్ ప్రాంతంలో విషాదం చోటుచేసుకుంది. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో రెండేళ్ళ పాప నీటి సంపులో పడి చనిపోయింది. సంజయ్ గాంధీ నగర్‌లో అశ్విని(2) కుటుంబ సభ్యలు ఎవరూ గమనించకపోవడంతో ప్రమాదవశాత్తు నీటి సంపులో పడిపోయింది. చిన్నారి సంపులో పడిన చాలాసేపటి వరకు తల్లిదండ్రులకు తెలియకపోవడంతో నీటిలో మునిగి చనిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తల్లదండ్రులు శోషసంద్రంలో మునిగిపోయారు.