
మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ మండలంలోని నిన్న రాత్రి అన్నోజిగూడలో ఇద్దరు యువకులు వీరంగం సృష్టించారు. పోచారం ఇన్ఫోసిస్ కంపెనీలో విధులు ముగించుకుని భర్తతో కలిసి బైక్ పై ఇంటికి వెళ్తుండగా రాంగ్ రూట్ లో ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ఎదురుగా వచ్చి భయబ్రాంతులకు గురిచేశారు. ఇదేంటని ప్రశ్నించినందుకు లేడీ సెక్యూరిటీ గార్డు దంపతులపై యువకులు దాడి చేశారు. భార్యాభర్తలు ఎదురుతిరగడంతో యువకులు అక్కడి నుంచి పారిపోయారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సమీపంలోని సీసీ పుటేజీను పరిశీలిస్తున్నారు. యువకులు పూటుగా మద్యం సేవించినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.