UAE అధ్యక్షుడి తమ్ముడు చనిపోతే.. మూడు రోజులు సంతాప దినాలు

UAE అధ్యక్షుడి తమ్ముడు చనిపోతే.. మూడు రోజులు సంతాప దినాలు

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) లో ఆ దేశ అధ్యక్షుడు సోదరుడు మరణించాడని మూడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించారు. జూలై 27న చనిపోయిన తన సోదరుడు అబుదాబి పాలకుల ప్రతినిధి, దివంగత సోదరుడు షేక్ సయీద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ కు.. అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ సంతాపం తెలిపారు.

ఈ సందర్భంగా ఆ దేశ ప్రెసిడెన్షియల్ కోర్ట్ ఓ సంస్మరణను జారీ చేసింది. మూడు రోజుల పాటు సంతాప దినాలుగా పాటించాలని దేశ ప్రజలను ఆదేశించింది. అంటే జూలై 27, 28, 29తో ఈ సంతాప దినాలు ముగుస్తాయి. దేవుడు అతన్ని స్వర్గానికి పంపిస్తాడని, అతని కుటుంబానికి సహనం, ఓదార్పును అందిస్తాడని సంస్మరణలో పేర్కొంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడి సోదరుడు షేక్ సయీద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని గత వారమే ప్రెసిడెంట్ కోర్టు ప్రకటించింది.