
ఆసియా కప్ 2025కు ముందు క్రికెట్ ఫ్యాన్స్ ను ఎంటర్ టైన్ చేయడానికి ట్రై సిరీస్ సిద్ధంగా ఉంది. శుక్రవారం (ఆగస్టు 29) నుండి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ టీ20 ఫార్మాట్ లో ముక్కోణపు సిరీస్ ఆడనున్నాయి. పాకిస్థాన్ జట్టుకు సల్మాన్ అఘా జట్టును నడిపిస్తుండగా.. ఆఫ్ఘనిస్తాన్ జట్టును రషీద్ ఖాన్ లీడ్ చేయనున్నాడు. మహమ్మద్ వసీం యూఏఈ జట్టుకు సారధ్యం వహించనున్నాడు. రిజ్వాన్, బాబర్ అజామ్ లేకపోవడంతో పాకిస్థాన్ యువ జట్టు ఎలా రాణిస్తుందో ఆసక్తికరంగా మారింది. యూఏఈ సంచలనాలపై కన్నేసింది.
ముజీబ్ ఉర్ రెహమాన్, మహ్మద్ నబీ, నూర్ అహ్మద్, రషీద్ ఖాన్ లాంటి పటిష్టమైన స్పిన్నర్లతో ఆఫ్ఘనిస్తాన్ టైటిల్ ఫేవరేట్ గా బరిలోకి దిగనుంది. 2024 టీ20 వరల్డ్ కప్ సెమీఫైనలిస్టులైన ఆఫ్ఘనిస్తాన్‌తో పాకిస్తాన్ టోర్నీ తొలి మ్యాచ్ లో తలబడనున్నాయి. ప్రతి జట్టు మిగతా జట్లతో రెండుసార్లు తలపడుతుంది. తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెప్టెంబర్ 7 న జరగబోయే ఫైనల్ ఆడతాయి. షార్జా క్రికెట్ స్టేడియంలో మ్యాచ్ లన్ని జరగనున్నాయి.
ఈ సిరీస్ పాకిస్థాన్ కు పెద్ద పరీక్షగా మారనుంది. ఇటీవలే ఆఫ్ఘనిస్తాన్ అంతర్జాతీయ క్రికెట్ లో అద్భుత విజయాలను సాధిస్తోంది. మరోవైపు బంగ్లాదేశ్ పై యూఏఈ సిరీస్ గెలిచి ఊపు మీద ఉంది. దీంతో పాకిస్థాన్ మిగిలిన రెండు జట్ల నుంచి ఛాలెంజ్ ఎదురు కానుంది. ఇటీవలే బంగ్లాదేశ్‌తో 1-2 తేడాతో టీ20 సిరీస్ కోల్పోవడం పాకిస్థాన్ జట్టు ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీసింది. ఆఫ్ఘనిస్తాన్ చివరిసారిగా డిసెంబర్‌లో టీ20 సిరీస్ ఆడింది. ఈ సిరీస్ లో జింబాబ్వేను 2-1 తేడాతో ఓడించింది.
ఆసియా కప్ యూఏఈ వేదికగా సెప్టెంబర్ 9 నుంచి 28వ తేదీ వరకు జరగనుంది. మొత్తం ఎనిమిది జట్లు పోటీలో ఉండగా.. గ్రూప్–ఎలో ఇండియా, పాకిస్తాన్, యూఏఈ, ఒమన్.. గ్రూప్–బిలో శ్రీలంక, అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్, హాంకాంగ్ బరిలో నిలిచాయి. దుబాయ్, అబుదాబి వేదికలుగా ఓవరాల్‌గా 19 మ్యాచ్‌లు జరుగుతాయి. టీమిండియా సెప్టెంబర్ 10న యూఈఏతో, 14న పాకిస్తాన్‌తో, 19న ఒమన్‌తో పోటీపడనుంది.
స్క్వాడ్ ల వివరాలు:
ఆఫ్ఘనిస్తాన్ స్క్వాడ్:
రషీద్ ఖాన్ (కెప్టెన్), రహ్మానుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, దర్విష్ రసూలీ, సెదిఖుల్లా అటల్, అజ్మతుల్లా ఒమర్జాయ్, కరీం జనత్, మహ్మద్ నబీ, గుల్బాదిన్ నాయబ్, షరాఫుద్దీన్ అష్రఫ్, మహ్మద్ ఇషాక్, ముజీబ్ ఉర్ రహమాన్, అల్లా ఘజన్, అల్లాహ్ ఘజన్ అహ్మద్‌జాయ్, ఫజల్‌హాక్ ఫారూఖీ
పాకిస్తాన్ స్క్వాడ్:
సల్మాన్ అఘా (కెప్టెన్), అబ్రార్ అహ్మద్, ఫహీమ్ అష్రఫ్, ఫఖర్ జమాన్, హరీస్ రవూఫ్, హసన్ అలీ, హసన్ నవాజ్, హుస్సేన్ తలాత్, ఖుష్దిల్ షా, మహ్మద్ హారీస్ (వికెట్-కీపర్), మహ్మద్ నవాజ్, మహ్మద్ వసీమ్ జూనియర్, సాహిబ్జాదా మ్, సాహిబ్జాదా మ్హరుబాన్, ఆఫ్రిది మరియు సుఫియాన్ ముఖీమ్
యుఎఇ స్క్వాడ్:
ముహమ్మద్ వసీమ్ (కెప్టెన్), అలీషాన్ షరాఫు, ఆర్యన్ష్ శర్మ (వికెట్ కీపర్), ఆసిఫ్ ఖాన్, ధ్రువ్ పరాశర్, ఈతాన్ డిసౌజా, హైదర్ అలీ, హర్షిత్ కౌశిక్, జునైద్ సిద్దిక్, ముహమ్మద్ ఫరూక్, మహ్మద్ జవదుల్లా, ముహమ్మద్ జోహైబ్, రాహుల్ చోప్రా (వికెట్ కీపర్), రోహిద్ ఖాన్.
ALSO READ : టీమిండియా బౌలర్ అయినా తగ్గేదే లేదు
ట్రై-సిరీస్ షెడ్యూల్:
ఆగస్టు 29 – ఆఫ్ఘనిస్తాన్ vs పాకిస్తాన్
ఆగస్టు 30 – యుఏఈ vs పాకిస్తాన్
సెప్టెంబర్ 1 – యుఏఈ vs ఆఫ్ఘనిస్తాన్
సెప్టెంబర్ 2 - పాకిస్థాన్ vs ఆఫ్ఘనిస్తాన్
సెప్టెంబర్ 4 - పాకిస్తాన్ vs యుఎఇ
సెప్టెంబర్ 5 – ఆఫ్ఘనిస్తాన్ vs యుఎఇ
సెప్టెంబర్ 7 – ఫైనల్
ట్రై సిరీస్ లైవ్ స్ట్రీమింగ్ ఇందులో చూడాలంటే..?
ట్రై సిరీస్ 2025 మ్యాచ్‌లు ఫ్యాన్ కోడ్ యాప్ లో ప్రత్యక్ష ప్రసారం చేయబడతాయి. ఇండియాలో టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం ఉండదు.