ప్యాసింజర్‌కు కిడ్నీ దానం చేసిన క్యాబ్ డ్రైవర్

ప్యాసింజర్‌కు కిడ్నీ దానం చేసిన క్యాబ్ డ్రైవర్

కన్న తల్లిదండ్రులకు కష్టం వస్తేనే ఒకటికి పది సార్లు ఆలోచించే సమాజంలో ఉన్న ఈ రోజుల్లో.. మానవత్వంతో ఆలోచించే వాళ్లు కూడా తక్కువే.  ఏం చేసినా స్వార్థం లేకుండా, ప్రయోజనం లేకుండా చేసే వాళ్లు చాలా అరుదు. అలాంటి పరిస్థితులున్న ఈ తరుణంలో ఓ క్యాబ్ డ్రైవర్ కు ప్రయాణికుడు కిడ్నీ దానం చేశాడు. ఈ విషయాన్ని గుడ్ న్యూస్ మూవ్ మెంట అనే పేరున్న ఇన్‌స్టాగ్రామ్ అడ్మిన్ పోస్ట్ చేశారు. 

ఓ రోజు టిమ్ లెట్స్ అనే ఉబర్ డ్రైవర్ కు బిల్ సుమీల్ అనే వ్యక్తి తన సమస్యలను  వివరించాడు. తన కిడ్నీ చెడిపోయిందని, డయాలసిస్ చేయించుకునేందుకు వెళ్తున్నానని చెప్పాడు. అది విన్న టిమ్ తన కిడ్నీ ఇస్తానని చెప్పాడు. టిమ్ చెప్పిన మాటలను సుమీల్ నమ్మలేకపోయాడు. ఎందుకంటే తనకు ఎలాంటి పరిచయం లేని వ్యక్తి, తనకు తన శరీరంలో ఒక భాగమైన కిడ్నీని ఎందుకు ఇస్తాడు అనుకున్నాడు. కానీ బిల్ నమ్మకాన్ని ఒమ్ము చేస్తూ.. టిమ్ తన ఫోన్ నంబర్, పేరు తీసుకుని అక్కడ్నుంచి వెళ్లిపోయాడు. ఆ తర్వాత కొన్ని రోజులు మళ్లీ బిల్.. టిమ్ ను సంప్రదించగా తాను కిడ్నీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. వాళ్లిద్దరి బ్లడ్ గ్రూపులు కూడా మ్యాచ్ కావడంతో వైద్యులు శస్త్రచికిత్స చేసి బిల్ కిడ్నీని టిమ్ కు అమర్చారు. 

ఆ తర్వాత నుంచి వాళ్లిద్దరూ మంచి స్నేహితులయ్యారు. ప్రస్తుతం బిల్ డెలావేర్ విశ్వవిద్యాలయంలోని రెనల్ రిహాబ్ సెంటర్‌లో ఉండగా.. టిమ్ జర్మనీలో నివసిస్తున్నాడు. వీరిద్దరికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలకు లక్షల వ్యూస్, లైకులు వస్తున్నాయి. దీంతో టిమ్ ఔదార్యంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

https://www.instagram.com/p/CqUSV77sxbp/