వాట్సాప్​తో ఉబర్ ​ట్యాక్సీ బుకింగ్​

వాట్సాప్​తో ఉబర్ ​ట్యాక్సీ బుకింగ్​

న్యూఢిల్లీ:  వాట్సాప్ ద్వారా ఉబర్ రైడ్‌‌లను బుక్ చేసుకునేందుకు రైడ్-హెయిలింగ్ సంస్థ ఉబర్ ఈ ఏడాది ప్రారంభంలో వాట్సాప్‌‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ప్రస్తుతానికి ఈ సర్వీస్ ఢిల్లీ-–ఎన్​సీఆర్,​  లక్నో ప్రాంతాల్లో అందుబాటులో ఉంది. మిగతా నగరాలకు త్వరలోనే విస్తరిస్తామని ఉబర్​ ప్రకటించింది. వాట్సాప్​ యూజర్లు కేవలం మొబైల్ నంబర్‌‌కు మెసేజ్​ పంపడం ద్వారా ఉబర్​ ట్యాక్సీని బుక్ చేసుకోవచ్చు. అంతేగాక  తమ ట్రిప్ రసీదును వాట్సాప్​లోనే పొందవచ్చు.  ఇంగ్లీష్,  హిందీ భాషలను ఉపయోగించి వెహికల్​ను బుక్ చేసుకోవచ్చు.  వాట్సాప్ ద్వారా వెహికల్​ను బుక్​ చేసుకోవడం ఎలాగో తెలుసుకుందాం. 

    స్టెప్​ 1: వాట్సాప్​ ద్వారా ఉబర్​ వెహికల్​ను బుక్ చేయడానికి, మీరు మీ ఫోన్ కాంటాక్ట్‌‌లలో ఉబర్​ అధికారిక నంబర్‌‌ +91 7292000002ను  తప్పనిసరిగా సేవ్ చేయాలి.

    స్టెప్​ 2: సేవ్ చేసిన తర్వాత, వాట్సాప్​కి వెళ్లి ఉబర్​ చాట్‌‌బాట్‌‌తో కొత్త చాట్‌‌ని ప్రారంభించండి. సేవ్​ చేయకుంటే http://wa.me/917292000002 ద్వారా చాట్‌‌ని ప్రారంభించవచ్చు

    స్టెప్​ 3: చాట్‌‌లో ‘హాయ్’ అని మెసేజ్​ పంపండి

    స్టెప్​ 4: ఇప్పుడు మీ పికప్/  డెస్టినేషన్ పాయిం ట్‌‌ల పూర్తి చిరునామాను పంపండి.   పికప్ కోసం లైవ్​ లొకేషన్​ను​ కూడా షేర్ చేయవచ్చు

    స్టెప్​ 5: ఇప్పుడు ఉబర్ ఈ ప్రయాణానికి వసూలు చేసే ఛార్జీలు, ప్రయాణ సమయం వంటి వివరాలు వస్తాయి.

    స్టెప్​ 6: చార్జీకి ఒప్పుకున్నట్టు మెసేజ్​ పంపాలి. ఇప్పుడు, సమీపంలోని డ్రైవర్ రైడ్ రిక్వెస్టును అంగీకరించిన తర్వాత ఉబర్​ మీకు వాట్సాప్​లో నోటిఫికేషన్‌‌ను పంపుతుంది. కాసేపట్లో వెహికల్​మీ ముందుకు వస్తుంది.