డిస్పూర్: అస్సాం అసెంబ్లీలో యూనిఫార్మ్ సివిల్ కోడ్ (యూసీసీ) బిల్లు ఆమోదం పొందింది. బుధవారం 5 గంటల పాటు జరిగిన చర్చ అనంతరం ఈ బిల్లును మూజువాణి ఓటుతో సభ ఆమోదించింది. ఈ చట్టం మహిళలకు సాధికారత కల్పించి, వారిని గౌరవిస్తుందని అధికార పార్టీ శాసనసభ్యులు స్పష్టం చేయగా.. ప్రతిపక్ష సభ్యులు ఇదొక ‘రాజకీయ స్టంట్’ అని అభివర్ణించారు.
దేశంలోని పౌరులందరికీ ఒకే చట్టం అమలు చేయాలనేది ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) ముఖ్య ఉద్దేశం. దేశంలో ఉత్తరాఖండ్, గుజరాత్ తర్వాత యూసీసీకి ఆమోదం తెలిపిన మూడో రాష్ట్రంగా అస్సాం నిలిచింది.
