ఉద్యోగులు, కార్మికుల కోసమే కాంగ్రెస్​ ట్రేడ్ యూనియన్​లో చేరిన : ఊదరి గోపాల్

ఉద్యోగులు, కార్మికుల కోసమే కాంగ్రెస్​ ట్రేడ్ యూనియన్​లో చేరిన : ఊదరి గోపాల్

హైదరాబాద్, వెలుగు : జీహెచ్ఎంసీ ఉద్యోగులు, కార్మికుల శ్రేయస్సు కోసమే కాంగ్రెస్ ట్రేడ్ యూనియన్​లో చేరానని జీహెచ్ఎంఈయూ అధ్యక్షుడు ఊదరి గోపాల్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. కాంగ్రెస్​ ప్రభుత్వంలో ఉద్యోగ, కార్మికులకు న్యాయం జరుగుతుందని చెప్పారు. నంది అవార్డుల పేరును గద్దర్ అవార్డులుగా మార్చి దళితులకు పెద్దపీట వేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు.

98 శాతం దళితులు ఉన్న జీహెచ్ఎంసీలో, వారికి మెరుగైన వసతులు కల్పించాలనే ఉద్దేశంతో​ కాంగ్రెస్ ​ట్రేడ్ యూనియన్​లో చేరానని వెల్లడించారు. కార్మికుల హెల్త్ కార్డులు, ఇంటి స్థలాలు, ఔట్ సోర్సింగ్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం  కృషి చేస్తానన్నారు.