ఉదయ్ పూర్ ఘటన నిందితులకు కఠినశిక్ష విధించాలి

ఉదయ్ పూర్ ఘటన నిందితులకు కఠినశిక్ష విధించాలి

ఉదయ్‌పూర్‌లో జరిగిన దారుణ హత్య నమ్మలేని విధంగా ఉందని... ఈ ఘటనతో భయాందోళనకు గురయ్యానని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో జరిగిన సంచలన సంఘటనపై స్పందించిన కేటీఆర్... ఈ అనాగరిక హింసకు పౌర సమాజంలో స్థానం లేదన్నారు. నేరస్తులకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా అత్యంత కఠినమైన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. ఇస్లాం మతాన్ని అవమానించాడన్న ఆరోపణలతో ఓ వ్యక్తిని ఇద్దరు వ్యక్తులు కలిసి పట్టపగలే అత్యంత కిరాతకంగా నరికి చంపారు. దీంతో ఆ రాష్ట్రవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరికొన్ని చోట్ల కర్ఫ్యూ విధించారు. నెల రోజులపాటు జనం గుమిగూడకుండా నిషేధాజ్ఞలు విధించారు. ఇక ఈ హత్యను ఉగ్రవాద సంబంధిత ఘటనగా పరిగణిస్తోన్న కేంద్ర ప్రభుత్వం... ఉదయ్ పూర్ జాతీయ దర్యాప్తు సంస్థకు చెందిన ప్రత్యేక బృందాన్ని పంపించింది.