
త్రిగుణ్ హీరోగా మహిపాల్ రెడ్డి దర్శకత్వంలో శంకర్ లుకలపుమధు నిర్మిస్తున్న చిత్రం ‘ఉద్వేగం’. తాజాగా ఈ మూవీ టీజర్‌ను దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రిలీజ్ చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ ‘కోర్టు రూమ్ డ్రామాతో తెలుగులో చాలా తక్కువ సినిమాలు వచ్చాయి. టీజర్ చూసిన తరువాత చాలా సిన్సియర్ అటెంప్ట్ అనిపించింది. ఈ చిత్రం కచ్చితంగా వండర్ క్రియేట్ చేస్తుంది. టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్’ అని చెప్పారు.
త్రిగుణ్ హీరోగా నటిస్తున్న 25వ చిత్రమిది. శ్రీకాంత్ అయ్యంగార్, పరుచూరి గోపాలకృష్ణ, శివ కృష్ణ, ఐడ్రీమ్ అంజలి ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కార్తిక్ కొడగండ్ల సంగీతం అందిస్తున్నాడు.