తెలంగాణలో పాలకపక్షానికి కష్టకాలం

తెలంగాణలో పాలకపక్షానికి కష్టకాలం
  • ప్రతిపక్షాలు కొంచెం కష్టపడితే మంచి ఫలితాలు వస్తయ్
  • రాజకీయ నాయకులకు ఈ ఏడాది బాగుంటుంది
  • కేసీఆర్​ ఎక్కువగా జర్నీలు చేయొద్దు
  • తెలంగాణ భవన్​లో పంచాంగ శ్రవణం


హైదరాబాద్: పాలకపక్షానికి ఈసారి కష్టకాలం ఉందని వేదపండితులు అన్నారు. ప్రతిపక్షాలు కొంచెం కష్టపడితే మంచి ఫలితాలు వస్తయని తెలిపారు. క్రోధి నామ సంవత్సర తెలుగు సంవత్సరాది ఉగాది వేడుకలు తెలంగాణ భవన్‌లో ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ స్పీకర్‌ మాజీ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. ఉగాది పర్వదినం సందర్భంగా వేదిపండితులు పంచాంగం పఠనం వినిపించారు. ‘ఈ ఏడాదిలో  రైతులకు శుభం కలుగుతుంది. ఉత్పత్తి ధరలు ఆకాశానికి అంటే అవకాశం ఉంది. ప్రపంచం అంతా ఆర్థికంగా ఇబ్బందులు ఎదురైతాయి. దేశ సరిహద్దులోనే కాదు ప్రజల మధ్య పరస్పర మత విద్వేషాలు పెరుగుతాయి. 

ఈ ఏడాది చంద్ర గ్రహణం, సూర్య గ్రహణం కనిపించవు. కేసీఆర్‌ అన్ని వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. వారి మాటకు, గమనానికి అడ్డులేని సంవత్సరంగా కనిపిస్తోంది. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. వాహన ప్రమాద సూచన ఉంది.  ఎక్కువ ప్రయాణాలు చేయొద్దు. రాజకీయ నాయకులకు ఈ ఏడాది బాగుంటుంది.. అధిష్టానం ప్రేమ, ప్రజల ఆధరణతో మంచి పేరు, విజయాలు తెచ్చుకుంటారు.