వాట్సాప్ అడ్మిన్ గా తొల‌గింపు.. కోర్టుకు వెళ్లిన వ్య‌క్తి

వాట్సాప్ అడ్మిన్ గా తొల‌గింపు.. కోర్టుకు వెళ్లిన వ్య‌క్తి

వాట్సాప్ గ్రూప్‌ల నుంచి ఎవరైనా మనల్ని తొలగిస్తే ఎలా ఉంటుంది. దానికి కారణాలేమైనా గానీ.. అలా ఉన్న పలంగా తీసేస్తే ఎవరికైనా కాస్త బాధ కలుగుతుంది. మామూలుగా అయితే దీని వల్ల పెద్ద నష్టమేం జరగకపోవచ్చు. కాబట్టి చాలా మంది దీన్ని అంతగా పట్టించుకోరు. పోతే పోనీ అని ఊరుకుంటారు. కానీ ఓ వ్యక్తి మాత్రం తనకు వాట్సాప్ గ్రూప్ నుంచి తొలగించినందుకు తీవ్ర మనస్తాపం చెందాడు. అంతే కాదు ఆతను చేసిన పనికి ప్రస్తుతం అందరూ దిగ్భ్రాంతికి కూడా గురవుతున్నారు.

హెర్బర్ట్ బైట్వాబాబో అనే ఉగాండా వాట్సాప్ గ్రూప్ నుంచి తొలగించబడిన తర్వాత కోర్టుకు వెళ్లాడు. ఫిర్యాదుదారుడి మాట విన్న న్యాయస్థానం, అడ్మిన్‌ని తిరిగి చేర్చమని కోరింది, అయితే ఇక్కడ అనుకోని సంఘటన జరిగింది. హెర్బర్ట్ మళ్లీ గ్రూప్‌లో భాగమైన వెంటనే, సభ్యులందరూ ఆ గ్రూప్ లో నుంచి వెళ్లిపోయి.. అతను లేని మరో కొత్త గ్రూప్ ను క్రియేట్ చేశారని తెలిసింది. ఇది ఆ వ్యక్తిని మళ్లీ కోర్టు మెట్లు ఎక్కేలా చేసింది.

"బుయాంజా మై రూట్స్" అనేది సంబంధిత వాట్సాప్ గ్రూప్ పేరని మకిన్‌డే చీఫ్ మెజిస్ట్రేట్ కోర్ట్ కోర్టు ఆర్డర్‌లో పేర్కొంది.

వాట్సాప్ గ్రూప్ నుంచి ఎందుకు తొలగించారు?

అతన్ని అసలు వాట్సాప్ గ్రూప్ నుంచి ఎందుకు తీసివేయవలసి వచ్చిందంటే.. ఈ వాట్సాప్ గ్రూప్ ఉగాండాలోని రుకుంగిరి జిల్లాలోని బుయాంజా సబ్-కౌంటీ నివాసితులకు దాతృత్వ సహకారాలు, సంతాపాన్ని అందించడం, సహాయాన్ని అందించడం కోసం ఏర్పాటు చేశారు. హెర్బర్ట్, ఇతర సభ్యులు సభ్యత్వం, నమోదు కోసం చెల్లింపులు కూడా చేశారు.

2017లో ఈ గ్రూప్ స్థాపించగా.. అప్పట్నుంచి దాని నిర్వహణ, ఆడిట్ వంటి వివరాలపై హెర్బర్ట్ ప్రశ్నించగా.. విషయాలు సరిగ్గా చెప్పలేదు. మే 2023న అడ్మిన్ అసింగుజా అతనిని గ్రూప్ నుంచి తొలగించడంతో.. అతని ప్రవర్తన అసభ్యంగా ఉందని తెలిసింది. ఆ తర్వాత, అతను కోర్టును ఆశ్రయించగా, అతని చర్యలు సంఘం స్వేచ్ఛను ఉల్లంఘిస్తున్నాయని వారు పేర్కొన్నారు.