దేశవ్యాప్తంగా 20 ఫేక్ యూనివర్సిటీలు, ఏపీలో రెండు: UGC

దేశవ్యాప్తంగా 20 ఫేక్ యూనివర్సిటీలు, ఏపీలో రెండు: UGC

దేశవ్యాప్తంగా 20 నకిలీ యూనివర్సిటీలు ఉన్నట్లు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజిసీ) గుర్తించింది. వీటిలో అత్యధికంగా దేశ రాజధాని ఢిల్లీ(8)లోనే ఉండగా, ఆ తరువాత ఉత్తర్ ప్రదేశ్(4) రెండో స్థానంలో ఉంది. వీటిలో తెలుగు రాష్ట్రమైన ఏపీకి చెందినవి రెండు యూనివర్సిటీలు ఉన్నాయి. ఈ సంస్థలకు డిగ్రీని ప్రదానం చేసే ఎలాంటి అధికారం లేదని యూజిసీ వెల్లడించింది.

గుర్తింపు లేని, మోసపూరిత వర్సిటీల ఉచ్చులో విద్యార్థులు పడకుండా రక్షించడమే తమ లక్ష్యమన్న యూజిసీ.. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆయా యూనివర్సిటీల్లో నమోదు చేసుకునే ముందే ఆ విశ్వవిద్యాలయాల అక్రిడిటేషన్ స్థితిని చెక్ చేసుకోవాలని సూచించారు.

యూజిసీ గుర్తించిన నకిలీ విశ్వవిద్యాలయాల జాబితా

  • క్రైస్ట్ న్యూ టెస్టమెంట్ డీమ్డ్ యూనివర్సిటీ (గుంటూరు, ఆంధ్రప్రదేశ్)
  • బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఆఫ్ ఇండియా (విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్)
  • ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ & ఫిజికల్ హెల్త్ సైన్సెస్ (AIIPHS) రాష్ట్ర ప్రభుత్వ విశ్వవిద్యాలయం (అలీపూర్, ఢిల్లీ)
  • కమర్షియల్ యూనివర్సిటీ లిమిటెడ్ (దర్యాగంజ్, ఢిల్లీ)
  • ఐక్యరాజ్యసమితి విశ్వవిద్యాలయం (ఢిల్లీ)
  • వొకేషనల్ యూనివర్సిటీ (ఢిల్లీ)
  • ADR-సెంట్రిక్ జురిడికల్ యూనివర్సిటీ (రాజేంద్ర ప్లేస్, న్యూఢిల్లీ)
  • ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (న్యూఢిల్లీ)
  • స్వయం ఉపాధి కోసం విశ్వకర్మ ఓపెన్ యూనివర్సిటీ (ఢిల్లీ)
  • ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం (రోహిణి, ఢిల్లీ)
  • బడగన్వి సర్కార్ వరల్డ్ ఓపెన్ యూనివర్శిటీ ఎడ్యుకేషన్ సొసైటీ (బెల్గాం, కర్ణాటక)
  • సెయింట్ జాన్స్ యూనివర్సిటీ (కిషనట్టం, కేరళ)
  • రాజా అరబిక్ విశ్వవిద్యాలయం (నాగ్‌పూర్, మహారాష్ట్ర)
  • శ్రీ బోధి అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (పుదుచ్చేరి)
  • గాంధీ హిందీ విద్యాపీఠం (ప్రయాగ్‌రాజ్, ఉత్తరప్రదేశ్)
  • నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ ఎలక్ట్రో కాంప్లెక్స్ హోమియోపతి (కాన్పూర్, ఉత్తరప్రదేశ్)
  • నేతాజీ సుభాష్ చంద్రబోస్ యూనివర్సిటీ (ఓపెన్ యూనివర్సిటీ) (అలీగఢ్, ఉత్తరప్రదేశ్)
  • భారతీయ శిక్షా పరిషత్, భారత్ భవన్ (లక్నో, ఉత్తరప్రదేశ్)
  • ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ (కోల్‌కతా, పశ్చిమ బెంగాల్)
  • ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ అండ్ రీసెర్చ్ (కోల్‌కతా, పశ్చిమ బెంగాల్)