కాగజ్ నగర్ లో ఘనంగా ఉజ్జయిని మహంకాళి బోనాలు

 కాగజ్ నగర్ లో ఘనంగా ఉజ్జయిని మహంకాళి బోనాలు

కాగజ్ నగర్/ కొత్తపల్లి, వెలుగు: ఆసిఫాబాద్​ జిల్లా కాగజ్ నగర్​లో ఉజ్జయిని మహంకాళి బోనాల వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఆయా గ్రామాల్లోని మహిళలు బోనమెత్తి అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. 

కనులపండువగా పోచమ్మ తల్లి బోనాలు

కరీంనగర్ పట్టణంలోని శ్రీపురం కాలనీ, చింతకుంట, కిసాన్ నగర్, కట్టరాంపూర్ ప్రాంతాల్లో పోచమ్మ, మైసమ్మ తల్లి బోనాల వేడుకలు వైభవంగా నిర్వహించారు. భక్తులు అమ్మవారికి బోనం సమర్పించారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ హాజరై బోనమెత్తుకొని ఆలయం వరకు వెళ్లి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, మాజీ మేయర్ రవీందర్ సింగ్, కార్పొరేటర్ పుష్పలత- రవీందర్, డివిజన్లకు చెందిన నాయకులు, భక్తులు పాల్గొన్నారు.