చిన్న ఫ్యామిలీలకు గుడ్ న్యూస్..భారత్ గ్యాస్ నుంచి 10 కిలోల సిలిండర్

చిన్న ఫ్యామిలీలకు గుడ్ న్యూస్..భారత్ గ్యాస్ నుంచి 10 కిలోల సిలిండర్

హైదరాబాద్ సిటీ, వెలుగు : భారత్ గ్యాస్ కంపెనీ మార్కెట్లోకి 10 కిలోల గ్యాస్ సిలిండర్లను అందుబాటులోకి తెచ్చింది. జీడిమెట్లలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో భారత్ గ్యాస్ అధికారులు ‘లైట్ జిప్’ పేరుతో ఈ సిలిండర్లను లాంచ్ చేశారు. మరో వారం, పది రోజుల్లో ఇవి మార్కెట్‌‌‌‌లో పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తాయని భారత్ గ్యాస్ డీలర్ అశోక్ కుమార్ తెలిపారు. ఈ సిలిండర్ కావాలనుకునే వారికి అడిగిన వెంటనే కనెక్షన్ ఇస్తామని, బుక్ చేసుకున్న 4 గంటల్లోనే డెలివరీ చేస్తామని చెప్పారు. ఇవి అత్యాధునిక ఫైబర్ బాడీతో తయారుచేసి ఉండడం వల్ల లోపల గ్యాస్ ఎంత లెవెల్ ఉందో స్పష్టంగా కనిపించేలా డిజైన్ చేశారన్నారు. ఆగస్టు 15 నాటికి దేశంలోని 70 ప్రధాన నగరాల్లో ఈ సిలిండర్లను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు వెల్లడించారు.

ధరల వివరాలు

ఈ 10 కిలోల సిలిండర్ ధర సుమారు రూ. 4,812 వరకు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఇందులో సిలిండర్ సెక్యూరిటీ డిపాజిట్, మొదటిసారి నింపే గ్యాస్ (రీఫిల్) ధర కలిసి ఉంటాయి. కేవలం రీఫిల్ ధర రూ. 650 నుంచి రూ. 700 మధ్య ఉండవచ్చని ప్రాంతాలను బట్టి ధరల్లో చిన్నపాటి మార్పులు ఉండే అవకాశం ఉందని నిర్వాహకులు తెలిపారు.