ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా జూలై 1 నుంచి 31 వరకు నిర్వహించిన ఆపరేషన్ ముస్కాన్ విజయవంతమైందని ఎస్పీ అఖిల్ మహాజన్ వెల్లడించారు. అన్ని శాఖల సమన్వయంతో 141 మంది బాల కార్మికులకు విముక్తి కల్పించినట్లు తెలిపారు.
బాల కార్మిక వ్యవస్థ నిర్మూలించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమం నిర్వహిస్తోందని.. పోలీస్, చైల్డ్ వెల్ఫేర్, కార్మిక, హెల్త్ డిపార్ట్మెంట్ శాఖల సమన్వయంతో ఆయా చోట్ల పనిచేస్తున్న 141 మంది చిన్నారులకు విముక్తి కల్పించి తల్లిదండ్రుల చెంతకు చేర్చినట్లు తెలిపారు. బాల కార్మికులను పనిలో పెట్టుకున్న 53 మందిపై కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ వెల్లడించారు.
