ఉజ్వల 2.0: నిరుపేదలకు ఫ్రీగా ఎల్పీజీ కనెక్షన్స్

ఉజ్వల 2.0: నిరుపేదలకు ఫ్రీగా ఎల్పీజీ కనెక్షన్స్

న్యూఢిల్లీ: ఉచిత గ్యాస్ కనెక్షన్ అందించే ఉజ్వల 2.O పథకాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఉత్తర ప్రదేశ్ లోని మహోబాలో నిర్వహించిన కార్యక్రమంలో మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. పేదలకు ఉచిత గ్యాస్ కనెక్షన్ ఇవ్వడంతో పాటు రీఫిల్ చేసిన ఫస్ట్ సిలిండర్, గ్యాస్ పొయ్యి ఫ్రీగా అందించనున్నారు. ఉజ్వల పథకాన్ని ప్రారంభించిన తర్వాత ఆ స్కీమ్ లబ్ధిదారులతో మోడీ మాట్లాడారు. దేశంలో కట్టెల పోయ్యిలపై వంట చేసే పరిస్థితి పోవాలని, ప్రతి ఇంట్లోనూ ఎల్పీజీ గ్యాస్ ఉండాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని ఈ సందర్భంగా ఆయన అన్నారు.

కాగా, 2016లో ఉజ్వల స్కీమ్ కింద దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న ఐదు కోట్ల మంది మహిళలకు కేంద్రం ఉచిత ఎల్పీజీ కనెక్షన్లను ఇచ్చింది. 2018లో మహిళలతోపాటు ఎస్సీ, ఎస్టీలతోపాటు అత్యంత వెనుకబడిన వర్గాలకు ఈ పథకాన్ని వర్తింపజేసింది. అలాగే ఈ స్కీంను 8 కోట్ల మందికి విస్తరించింది. ఉజ్వల 2.0లో కొత్తగా కోటి మందికి పైగా లబ్ధిదారులకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు అందజేయనున్నట్లు ఉన్నతాధికారులు చెబుతున్నారు.