ఉక్రెయిన్ బార్డర్లలో  రష్యా బలగాల పెంపు!

ఉక్రెయిన్ బార్డర్లలో  రష్యా బలగాల పెంపు!
  •    శాటిలైట్​ ఫొటోల ద్వారా  కన్ఫర్మ్​ చేసిన అమెరికా
  •    ఆరు కిలోమీటర్ల దూరంలో     నదిపై బ్రిడ్జి కట్టినట్టు వెల్లడి
  •    భారీగా వెపన్స్, జవాన్లను తరలించిందని ఆరోపణ

మాస్కో: ఉక్రెయిన్​ బార్డర్ల నుంచి బలగాలన్నింటినీ వాపస్​ తీసుకొస్తున్నామని రష్యా చెబుతున్నా.. ఆ దాఖలాలేవీ కనిపించట్లేదు. పైగా వెస్టర్న్​ రష్యా, క్రిమియా, బెలారస్​లలో మరిన్ని బలగాలను మోహరిస్తున్నట్టు అమెరికా కంపెనీ మ్యాక్సార్​ తీసిన శాటిలైట్ ఇమేజెస్ ద్వారా తెలుస్తోంది. తాజాగా 7 వేల మంది సైన్యాన్ని ఉక్రెయిన్​సరిహద్దులకు రష్యా పంపిందని ఆ శాటిలైట్​ ఫొటోల ద్వారా అమెరికా ఆరోపించింది. బెలారస్​–ఉక్రెయిన్​ సరిహద్దులకు జస్ట్​ ఆరు కిలోమీటర్ల దూరంలోనే ప్రిప్యాత్​ నదిపై ఓ బ్రిడ్జిని కట్టినట్టు తేల్చింది. అక్కడి బేస్​లో సెల్ఫ్​ ప్రొపెల్డ్​ ఆర్టిలరీ యూనిట్లతో ట్రైనింగ్​ క్యాంపులనూ నిర్వహిస్తున్నట్టు పేర్కొంది. కొన్ని ఫార్వర్డ్​ లొకేషన్లలో గ్రౌండ్​ ఎటాక్​ హెలికాప్టర్లనూ మోహరించిందని, ఓ పెద్ద ఆసుపత్రిని కట్టించిందని వెల్లడించింది. క్రిమియా, వెస్టర్న్​ రష్యాలో బలగాలు, భారీ ఆయుధాలను మోహరిస్తున్నట్టు కన్ఫర్మ్​ చేసింది. నార్త్​, నార్త్​ఈస్ట్ ఉక్రెయిన్​ సరిహద్దుల్లోనే రష్యా భారీగా బలగాలను  మోహరించిందని ఆ శాటిలైట్​ ఫొటోల ద్వారా తేల్చింది. ఉక్రెయిన్​ సరిహద్దుల్లో రష్యా ముప్పు ఇంకా తొలగిపోలేదని నార్త్​అట్లాంటిక్​ ట్రీటీ ఆర్గనైజేషన్ (నాటో) మరోసారి హెచ్చరించింది. తమ భద్రతకు ముప్పు తలపెట్టే చర్యలకు పాల్పడితే తగిన రీతిలోనే స్పందిస్తామంటూ రష్యా చెప్పిందని నాటో చీఫ్ జెన్స్ స్టోల్టెన్​బర్గ్ గుర్తు చేశారు.

ఇండియన్లను ఇప్పుడే తీస్కురాం: కేంద్రం 

ఉక్రెయిన్​పై ఏ క్షణాన్నైనా రష్యా దాడికి దిగే ప్రమాదముందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నా.. అక్కడి ఇండియన్లను ఇప్పుడప్పుడే ఇండియాకు తరలించే ఆలోచన లేదని ఫారిన్ మినిస్ట్రీ ప్రకటించింది. ‘‘ఇప్పటికిప్పుడైతే ఇండియన్లను తరలించేందుకు ఎలాంటి ప్లాన్స్​ లేవు. స్పెషల్ ఫ్లైట్లనూ నడపడట్లేదు. అయితే, ప్రస్తుతమున్న ఎయిర్ బబుల్ అరెంజ్​మెంట్స్, ఫ్లైట్ల సంఖ్య, ప్యాసింజర్లపై ఉన్న ఆంక్షలను మాత్రం ఎత్తేశాం. ఇండియా–ఉక్రెయిన్​ మధ్య చార్టర్డ్ ఫ్లైట్లను నడిపేలా ఎయిర్​లైన్స్​సంస్థలకు అవకాశం కల్పిస్తున్నాం’’ అని ఫారిన్​ మినిస్ట్రీ ఉన్నతాధికారి అరిందమ్ బాగ్చీ తెలిపారు.