ఉక్రెయిన్ నుంచి భారత పౌరుల తరలింపును వేగవంతం చేసింది కేంద్ర ప్రభుత్వం. లేటెస్ట్ గా 182 మంది విద్యార్థులతో రొమేనియా రాజధాని బుకారెస్ట్ నుంచి ఏడో విమానం ముంబైకి చేరుకుంది.కేంద్ర మంత్రి నారాయణ్ రాణే ఎయిర్ పోర్ట్ లో విద్యార్థులను పరామర్శించారు. ఇదిలావుండగా.. 216 మంది భారతీయ పౌరులతో కూడిన ఎనిమిదో విమానం హంగేరీలోని బుడాపెస్ట్ నుండి న్యూఢిల్లీకి బయలుదేరగా, తొమ్మిదవ విమానం 218 మంది భారతీయులను ఎక్కించుకుని బుకారెస్ట్ నుండి న్యూఢిల్లీకి బయలుదేరిందని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తెలిపారు. ఇప్పటి వరకు 7 విమానాల్లో 1,578 మంది భారతీయులను ఉక్రెయిన్ నుంచి భారత్ కు తీసుకొచ్చారు
Ukraine crisis: Seventh flight carrying 182 stranded Indians reaches Mumbai
— ANI Digital (@ani_digital) March 1, 2022
Read @ANI Story | https://t.co/73qVf3PDDH#OperationGanga #evacuateindianstudentsfromukraine #RussiaUkraineConflict pic.twitter.com/b9kVJVW7T9
మరిన్ని వార్తల కోసం:
