మా న్యూక్లియర్ ప్లాంట్​పై దాడికి పుతిన్ ప్లాన్ : ఉక్రెయిన్

మా న్యూక్లియర్ ప్లాంట్​పై దాడికి పుతిన్ ప్లాన్ : ఉక్రెయిన్

మా న్యూక్లియర్ ప్లాంట్​పై దాడికి పుతిన్ ప్లాన్

మేం చేస్తున్న ప్రతిదాడులు తట్టుకోలేక ప్లాంట్​పై కన్నేశారు : ఉక్రెయిన్

కీవ్ : జపోరిజియాలోని తమ ఆధీనంలో ఉన్న న్యూక్లియర్  ప్లాంట్​పై దాడిచేసేందుకు రష్యా ప్రెసిడెంట్  వ్లాదిమిర్  పుతిన్  ప్లాన్  చేస్తున్నారని ఉక్రెయిన్  డిఫెన్స్ ఇంటెలిజెన్స్  ఆరోపించింది. తాము చేస్తున్న ప్రతిదాడులు తట్టుకోలేక తమ న్యూక్లియర్  ప్లాంట్‌పై రష్యా అటాక్  చేయాలనుకుంటున్నదని ఇంటెలిజెన్స్ అధికారులు చెప్పారు. ఇంటర్నేషనల్  అటామిక్  ఎనర్జీ ఏజెన్సీ (ఐఏఈఏ)లోని సిబ్బంది రొటేషన్‌ను కూడా రష్యా అడ్డుకుంటున్నదని ఉక్రెయిన్  నేషనల్ సెక్యూరిటీ అండ్  డిఫెన్స్  కౌన్సిల్  సెక్రటరీ ఒలెక్సీ డానిలోవ్  ఆరోపించారు.

మరోవైపు, రష్యా–ఉక్రెయిన్  మధ్య జరుగుతున్న యుద్ధ పరిణామాలను గమనిస్తున్నామని అమెరికా తెలిపింది. ఇప్పటికైతే రేడియో యాక్టివ్  మెటీరియల్  లీకైన సూచనలు కనిపించడం లేదని యూఎస్  పేర్కొంది. కాగా, ప్రపంచవ్యాప్తంగా పది అతిపెద్ద న్యూక్లియర్  ప్లాంట్లలో జపోరిజియా న్యూక్లియర్  ప్లాంట్  కూడా ఒకటి. ఈ ప్లాంట్ లో ఆరు రియాక్టర్లు ఉన్నాయి. రష్యా‌‌‌‌‌‌‌‌–ఉక్రెయిన్  మధ్య యుద్ధం మొదలైన తర్వాత ఈ ప్లాంట్ ను మూసివేశారు.

కీవ్‌‌‌‌పై రష్యా అటాక్.. ఒకరి మృతి 

ఉక్రెయిన్  రాజధాని కీవ్​పై రష్యా శనివారం రాత్రి డ్రోన్లతో దాడులు చేసింది. ఈ అటాక్​లో ఒకరు చనిపోగా.. ముగ్గురు గాయపడ్డారని ఉక్రెయిన్  అధికారులు తెలిపారు. రష్యా ప్రయోగించిన డ్రోన్లలో 20 డ్రోన్లను నేలకూల్చామని, ఈ క్రమంలో ఒక డ్రోన్  శకలాలు గ్యాస్  స్టేషన్​పై పడి ఒకరు ప్రాణాలు కోల్పోయారని వెల్లడించారు.