నన్ను అంతం చేయడమే రష్యా మొదటి టార్గెట్

నన్ను అంతం చేయడమే రష్యా మొదటి టార్గెట్
  • టార్గెట్ నేనే
  • నా కుటుంబం అంతమే రష్యా లక్ష్యం
  • కీవ్ లోనే.. నా ప్రజలతోనే ఉన్నా
  • అమెరికా, యూరప్​ దూరమున్నయ్
  • మేం ఒంటరిగా పోరాడుతున్నం
  • ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వొలోదిమిర్ జెలెన్ స్కీ

కీవ్:  ‘‘నన్ను అంతం చేయడమే రష్యా మొదటి టార్గెట్ గా పెట్టుకుంది. ఆ తర్వాత నా భార్య ఒలెనా, నా ఇద్దరు పిల్లల్ని హతమార్చడం రెండో టార్గెట్ గా నిర్ణయించుకుంది. వాళ్లు ఉక్రెయిన్ అధినేతను హతమార్చడం ద్వారా దేశాన్ని రాజకీయ పరంగా నాశనం చేయాలని అనుకుంటున్నరు. అయినా సరే.. నేను నా దేశ రాజధాని కీవ్ లోనే ఉన్నా. నా ప్రజలతోనే ఉన్నా. నా కుటుంబం కూడా ఈ దేశంలోనే ఉంది” ఉక్రెయిన్​ ప్రెసిడెంట్​వొలిదిమిర్​ జెలెన్​స్కీ చెప్పారు. ఈమేరకు పేస్​బుక్​లో శుక్రవారం ఆయన ఓ వీడియో పోస్ట్​ చేశారు. తన కుటుంబసభ్యులు దేశ ద్రోహులు మాత్రం కారని, వారు ఎక్కడున్నారన్నది మాత్రం చెప్పబోనన్నారు. ఉక్రెయిన్ ప్రభుత్వం పని చేయడానికి కావాల్సిన ప్రతి ఒక్కరితోనూ తాను కలిసి ఉన్నానని ఆయన చెప్పారు. రష్యాపై ఇప్పటివరకు విధించిన ఆంక్షలు సరిపోవని, ఆ దేశం తన బలగాలను వెనక్కి తీసుకోవాలంటే మరింత కఠిన ఆంక్షలు విధించాలని కోరారు. రష్యా దళాలు కీవ్​లోకి చొచ్చుకురావడంతో జెలెన్​స్కీని అధికారులు 
బంకర్​లోకి తరలించారు.

అందరూ భయపడుతున్రు 
‘‘మాతో కలిసి పోరాడేందుకు ఎవరు సిద్ధంగా ఉన్నారు? నాకు ఏ ఒక్కరూ కనిపించడంలేదు. ఉక్రెయిన్ కు నాటో సభ్యత్వం ఇస్తామని గ్యారంటీ ఇచ్చేవాళ్లెవరైనా ఉన్నారా? ప్రతి ఒక్కరూ భయపడుతున్నరు. ఉక్రెయిన్ ను నాటోలో చేర్చుకుంటారా? అని నేను 27 యూరోపియన్ దేశాల అధినేతలను అడిగాను. కానీ అందరూ భయపడుతున్నరు. ఏ ఒక్కరి నుంచీ సమాధానం రావడంలేదు” అని జెలెన్ స్కీ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ యుద్ధ సమయంలో ఉక్రెయిన్ పౌరులే ధైర్యసాహసాలతో పోరాడుతున్నారని ఆయన కొనియాడారు.

కూర్చుని మాట్లాడుకుందాం
ఉక్రెయిన్ అంతటా పోరాటాలు కొనసాగుతున్నాయని జెలెన్ స్కీ చెప్పారు. ‘‘కూర్చుని మాట్లాడు కుందాం. రండి..” అని రష్యా ప్రెసిడెంట్ పుతిన్​కు మరోసారి పిలుపునిచ్చారు. మరింత ప్రాణనష్టాన్ని నివారించేందు కు కూర్చుని మాట్లాడుకోవాల్సిన అవస రం ఉందన్నారు. అయితే, చర్చలకు రష్యా సిద్ధంగా ఉందని, ముందుగా ఉక్రెయిన్ సోల్జర్లు లొంగిపోవాలని రష్యన్ అధ్యక్ష భవనం క్రెమ్లిన్ అధికార ప్రతినిధి స్పష్టంచేశారు.

ఆయుధాలు వదిలేస్తే చర్చలు: రష్యా
ఉక్రెయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో చర్చలు జరిపిపేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, అయితే వాళ్లు ఆయుధాలను వదిలేయాలని రష్యా ఫారిన్ మినిస్టర్ సెర్జీ​ లావ్రోవ్ చెప్పారు. ఉక్రెయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నియో నాజీలు పాలించడం రష్యాకు ఇష్టం లేదని స్పష్టం చేశారు. బెలారస్ రాజధాని మిన్స్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చర్చలు జరిపేందుకు సిద్ధమని క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ చెప్పారు.