
ఉక్రెయిన్ పై రెండో రోజు రష్యా యుద్ధం కొనసాగుతోంది. ఉక్రెయిన్ లోని 13 నగరాల్లో రష్యన్ బలగాలు తీవ్రమైన దాడులు చేస్తున్నాయి. తాము ఎక్కడా ప్రజలపై దాడులు చేయడం లేదని చెప్పిన రష్యా.. కొన్ని ప్రాంతాల్లో అపార్ట్ మెంట్లపై కూడా క్షిపణి దాడులు చేస్తోంది. ఇప్పటికే పలు సిటీల్లో ఉక్రెయిన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, సైనిక స్థావరాలు, డిఫెన్స్ వెపన్ స్టోరేజ్ సెంటర్ పై మిస్సైల్స్, బాంబు దాడులతో ధ్వంసం చేసింది. అటు కీవ్ కు 130 కిలో మీటర్ల దూరంలో ఉన్న చెర్నోబిల్ న్యూక్లియర్ రియాక్టర్ కేంద్రాన్ని రష్యా బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. కాగా, రష్యన్ ఆర్మీ దాడుల్లో ఇప్పటి వరకు 137 మంది చనిపోయినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రకటించారు. తమ దేశాన్ని కాపాడుకునేందుకు పోరాడుతూనే ఉన్నామని, అయితే ఈ యుద్ధంలో ప్రపంచ దేశాలు తమను ఒంటిరిని చేశాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
President Zelensky says Ukraine 'left alone' to fight Russia: AFP
— ANI (@ANI) February 25, 2022
అయితే ఉక్రెయిన్ వ్యాప్తంగా భారీగా బలగాలు మోహరించినట్లు జెలెన్స్కీ తెలిపారు. మరో 90 రోజుల పాటు బలగాల మోహరింపు ఉంటుందన్నారు. దేశ రక్షణలో ప్రాణత్యాగం చేసిన వీరులను హీరోలుగా కీర్తించారాయన. అమరుల త్యాగాలను ఈ దేశం ఎప్పటికీ గుర్తుంచుకుంటుదన్నారు.