
ఉక్రెయిన్పై రష్యా దళాలు చేస్తున్న బాంబు దాడుల్లో ఏడుగురు చనిపోయినట్లు ఉక్రెయిన్ ప్రకటించింది. దేశంలో ప్రధాన నగరమైన ఒడిసా శివారు ప్రాంతమైన పొడిల్స్క్ లోని సైనిక స్థావరంపై జరిగిన దాడిలో ఆరుగురు పౌరులు మృత్యువాతపడగా.. మరో 9మంది తీవ్రంగా గాయపడ్డారు. మరియుపోల్ సిటీపై జరిపిన దాడిలో ఒకరు చనిపోయినట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఉక్రెయిన్పై దాడులకు పాల్పడుతున్న 50 మంది రష్యా చొరబాటుదారులను హతమార్చినట్లు ఉక్రెయిన్ ప్రకటించింది. ఇదిలా ఉంటే రష్యా దళాలు లుహన్క్స్ రీజియన్లోని రెండు నగరాలను స్వాధీనం చేసుకున్నట్లు రాయిటర్స్ వార్తా సంస్థ ప్రకటించింది. మరోవైపు తమ భూభాగంలోకి ప్రవేశించిన ఐదు రష్యా విమానాలు, హెలికాప్టర్లను కూల్చివేసినట్లు ఉక్రెయిన్ జాయింట్ ఫోర్సెస్ కమాండ్ ప్రకటించింది.