మాస్కో ఎయిర్​పోర్ట్​పై డ్రోన్ దాడి

మాస్కో ఎయిర్​పోర్ట్​పై డ్రోన్ దాడి

 

  •     నుకోవ్ విమానాశ్రయం నుంచి ఆలస్యంగా బయలుదేరిన ఫ్లైట్స్
  •     ఉక్రెయిన్ పనే అని రష్యా విమర్శ

మాస్కో: రష్యాలోని నుకోవ్ ఇంటర్నేషల్ ఎయిర్​పోర్టుపై మంగళవారం తెల్లవారుజామున డ్రోన్ దాడి జరిగింది. డ్రోన్​ను గుర్తించిన అధికారులు దాన్ని కూల్చేశారు. దీంతో కొంత సేపు విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భద్రతా తనిఖీల తర్వాత విమానాల రాకపోకలను పునరుద్ధరించారు. డ్రోన్ దాడిని ఉగ్రవాద చర్యగా రష్యా అభివర్ణించింది. ఇది ఉక్రెయిన్ పనేనని మండిపడింది. ఎయిర్​పోర్ట్​తో పాటు మరికొన్ని చోట్ల దాడికి ప్రయత్నించిందని వివరించింది. సాధారణ ప్రజలే టార్గెట్​గా ఉక్రెయిన్ దాడికి దిగిందని విమర్శించింది. దాడి కారణంగా ల్యాండింగ్, టేకాఫ్​లకు అంతరాయం కలిగిందని ఏవియేషన్ అధికారులు ప్రకటించారు. డ్రోన్ల దాడితో టెక్నికల్ సమస్యలు తలెత్తడంతోనే సేవలు నిలిపివేసినట్లు తెలిపారు. డ్రోన్ దాడులపై మాస్కో మేయర్ సెర్గీ సోబియానిన్‌‌ స్పందించారు. మాస్కోతో పాటు చుట్టుపక్క నగరాలపై ఉక్రెయిన్ డ్రోన్ దాడులకు దిగిందని తెలిపారు. దాడిని విజయవంతంగా తిప్పికొట్టామన్నారు. ఈ దాడికి ఉక్రెయిన్ పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఈ చర్య ఉక్రెయిన్​ను మరింత ఇబ్బందులకు గురి చేస్తుందని హెచ్చరించారు. మూడు డ్రోన్లను మాస్కో వద్ద కూల్చేనట్లు వివరించారు. కలుగ్రా, కుబ్నిక సిటీల వద్ద రెండు డ్రోన్లను పేల్చేశారని తెలిపారు.