
కీవ్: రష్యా సైనికులను తిప్పికొట్టేందుకు ఉక్రెయిన్ సిటిజన్లు సిద్ధమవుతున్నారు. తలా ఓ గన్ను పట్టుకుని ఉన్నామని సోషల్ మీడియాలో వీడియోలు పోస్టు చేస్తున్నారు. కీవ్ ను ఆక్రమించుకోవాలని వచ్చే రష్యా సైనికులకు పీడకలలే మిగుల్తాయని బెదిరిస్తున్నరు. ఉక్రెయిన్ కేపిటల్ సిటీ కీవ్‌ను ఆధీనంలోకి తీసుకునేందుకు శివార్లలో రష్యా బలగాలు గుమిగూడుతున్నాయి. ఈ సందర్భంగా ఉక్రెయిన్ సైనికులతో పాటు అక్కడి లోకల్ వాళ్లు కూడా గన్స్ పట్టుకుని పోరాడేందుకు ముందుకొస్తున్నారు. ‘‘వాళ్లిక్కడికి వస్తే చచ్చిపోతారు. మేమిక్కడ చాలామందిమి గన్స్‌తో రెడీగున్నం. ప్రతి గల్లీలో వాళ్లను ఎదిరిస్తం”అని కీవ్‌లోని ఓ స్థానికుడు చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.