కీవ్: ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ రష్యాకు వార్నింగ్ ఇచ్చారు. తమ దేశాన్ని వెంటనే వదిలివెళ్లాలని రష్యన్ బలగాలను ఆయన హెచ్చరించారు. ‘తక్షణమే ఉక్రెయిన్ ను వదలిపోండి.. మీ ప్రాణాలను కాపాడుకోండి’ అని రష్యా సైనికులను ఉద్దేశించి జెలెన్స్కీ వ్యాఖ్యానించారు. రష్యాకు తమ దేశానికి మధ్య జరుగుతున్న యుద్ధంలో ఇప్పటివరకు 4,500 మంది రష్యన్ జవాన్లు చనిపోయారని తెలిపారు. రష్యాతో వార్ లో పోరాడేందుకు తమ దేశ జైళ్లలో ఉన్న పలువురు ఖైదీలను విడుదల చేస్తున్నామని చెప్పారు. ఆర్మీలో పని చేసిన అనుభవం, యుద్ధంలో ఫైట్ చేసేందుకు ఆసక్తి ఉన్న ఖైదీలను రిలీజ్ చేస్తున్నట్లు వెల్లడించారు.
Ukraine's President Volodymyr Zelensky appeals to Russian soldiers in speech - "Save your lives and leave": Reuters #RussiaUkraineConflict pic.twitter.com/EYswZ2Mq6f
— ANI (@ANI) February 28, 2022
ఇరు దేశాలకు మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు, యుద్ధాన్ని ఆపేందుకు యూరోపియన్ యూనియన్ (ఈయూ) జోక్యం చేసుకోవాలని.. స్పెషల్ ప్రొసీజర్ కింద అవసరమైన చర్యలు చేపట్టాలని జెలెన్స్కీ కోరారు. కాగా, రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధానికి ముగింపు పలికేందుకు బెలారస్ వేదికగా ఇవాళ శాంతి చర్చలు జరగనున్నాయి. అయితే చర్చలకు ఇరు దేశాలు పలు షరతులు పెడుతున్నాయి. యూరోపియన్ యూనియన్ లో కొనసాగాలనుకుంటే చర్చలకు రాబోమని రష్యా చెబుతుండగా.. ఈయూలో ఉంటామని, షరతుల్లేని చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని ఉక్రెయిన్ అంటోంది.
మరిన్ని వార్తల కోసం:
