బ్రిటన్‌లో ఒమిక్రాన్‌తో 12 మంది మృతి

బ్రిటన్‌లో ఒమిక్రాన్‌తో 12 మంది మృతి

బ్రిటన్‌లో ఒమిక్రాన్ వేరియంట్  కేసులు రోజురోజుకు భారీగా  పెరుగుతున్నాయి. ప్రపంచంలోనే అధిక కేసులతో ఆ దేశం అతలాకుతలం అవుతోంది. ఇప్పటి వరకు 37 వేలకు పైగా ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లోనే 12,133 మందికి కొత్తగా ఒమిక్రాన్ వైరస్ సోకింది.  అంతేకాదు కొత్త వేరియంట్ తో ఇప్పటి వరకు యూకేలో 12 మంది చనిపోయినట్లు  బ్రిటన్  ఆరోగ్య కార్యదర్శి సాజిద్  వాజిద్  తెలిపారు.  ఒమిక్రాన్ వేరియంట్ తో ఇప్పటి వరకు 104 మంది ఆస్పత్రిలో చేరినట్లు చెప్పారు.

ఒమిక్రాన్ మొదటి మరణం కూడా యూకేలోనే నమోదైంది. రానున్న కాలంలో ఆ దేశంలో మరింతగా కేసులు పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఒకేసారి పదివేల ఒమిక్రాన్ కేసులు