ఇళ్లల్లో తినేది కంటే.. పారేసేదే ఎక్కువ : రోజూ 100 కోట్ల ప్లేట్ల భోజనం వేస్ట్

ఇళ్లల్లో తినేది కంటే.. పారేసేదే ఎక్కువ : రోజూ 100 కోట్ల ప్లేట్ల భోజనం వేస్ట్

ప్రపంచ వ్యాప్తంగా ఆకలి కేకలు పెరిగిపోతున్నాయి. అయితే మరో వైపు వందల కోట్ల విలువైన ఆహారం వేస్ట్ అవుతోందని ఐక్యరాజ్యసమితి  వెల్లడించింది.  ఫుడ్ వేస్ట్ ఇండెక్స్ రిపోర్ట్‌ ప్రకారం  780 మిలియన్ల మంది ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారని చెప్పింది. ఇళ్లల్లోనే ఎక్కువగా ఆహారాన్ని  వృథా చేస్తున్నట్లు తెలిపింది.  2022లో మార్కెట్లో లభించిన మొత్తం ఫుడ్ లో  ఐదవ వంతు వృథా అయ్యిందంట..  ప్రపంచ వ్యాప్తంగా రోజు ఇళ్లలో దాదాపు బిలియన్ ప్లేట్ల మీల్స్   వేస్ట్ అయ్యిందని..ఇందులో ఇళ్లలో ఎక్కువ వృథా అయ్యిందని పేర్కొంది. 

2022లో రెస్టారెంట్లు, క్యాంటీన్‌లు,  హోటళ్లు వంటి ఆహార సంస్థలు 28 శాతం ఫుడ్ ను వృథా చేశాయి. అయితే మాంసాహారులు ..  పచ్చిమిర్చి వ్యాపారులు వంటి చిల్లర వ్యాపారులు 12 శాతం వృథా చేస్తున్నారంట. అయితే ఎక్కువగా 66 శాతం ఇండ్లల్లో  దాదాపు 631 మిలియన్ టన్నుల ఫుడ్ ను వేస్ట్ చేస్తున్నారని తెలిపింది. 

 ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏటా 931 మిలియన్ టన్నుల ఆహారం వ్యర్థ పదార్థంగా మారుతోంది. ఇండియాలో 68.7 మిలియన్ టన్నుల (వార్షిక తలసరి ఫుడ్‌ వేస్ట్ 50 కేజీలు) ఆహారాన్ని వ్యర్థ పదార్థంగా ఇంట్లోంచి చెత్తకుప్పలో వేస్తున్నారని ఐక్యరాజ్యసమితి ఎన్విరాన్‌మెంట్​ ప్రోగ్రామ్‌ నివేదిక కూడా బహిర్గత పరిచింది. 

వార్షిక తలసరి 50 కేజీల (దేశ ప్రజలు ఏడాదికి 68.8 మిలియన్‌ టన్నులు) ఆహారాన్ని వ్యర్థం చేస్తున్నారని నివేదిక తెలిపింది. అతి తక్కువ ఫుడ్‌ వేస్ట్ ఆస్ట్రియాలో వార్షిక తలసరి వ్యర్థాలు 39 కేజీలు ఉండగా, అత్యధికంగా నైజీరియాలో 189 కేజీలుగా నిర్ణయించడమైంది.

అమెరికాలో తలసరి ఫుడ్‌ వేస్ట్ 59 కేజీలు (19.4 మిలియన్‌ టన్నులు), చైనాలో ఏడాదికి  తలసరి ఫుడ్‌ వేస్ట్ 64 కేజీలు (91.6 మిలియన్‌ టన్నులు) ఉందని తేల్చింది. గృహాలు, హోటల్స్, రిటైల్‌ ఔట్‌లెట్స్‌ ద్వారా ఆహారం వ్యర్థం కావడం జరుగుతోంది. మాంసాహారం తరువాత మిగిలిన ఎముకలు, పీచు పదార్థాలు లాంటి తినడానికి వీలుకాని వ్యర్థాలను బయటవేయడం సర్వ సాధారణంగా జరుగుతుంది. కానీ, కొన్ని సంపన్న గృహాలు, శుభకార్యాలు, విందు భోజనాల అనంతరం మిగిలిన శుద్ధ ఆహారాన్ని డస్ట్ బిన్‌ లేదా వృథా చేయడం నేర సమానమని గమనించాలి.