అనుమతి లేని ఫంక్షన్​ హాళ్లను సీజ్​చేయాలి: కిషన్​ రెడ్డి

అనుమతి లేని ఫంక్షన్​ హాళ్లను సీజ్​చేయాలి: కిషన్​ రెడ్డి

బాధితులను పరామర్శించిన ఎంపీ

హైదరాబాద్​, వెలుగు: గ్రేటర్​ పరిధిలో అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ఫంక్షన్​ హాళ్లను సీజ్​ చేయాలని జీహెచ్​ఎంసీ అధికారులకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్​రెడ్డి సూచించారు. ఆదివారం హైదరాబాద్​ అంబర్​పేటలోని పెరల్​ గార్డెన్​ గోడ కూలి మృతి చెందిన విజయలక్ష్మి మృతదేహానికి సోమవారం ఆయన నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. హైదరాబాద్​లో అనేక హాళ్లకు పార్కింగ్​, ఫైర్​ సేఫ్టీ వంటివి లేవని, లైసెన్స్​ లేని ఫంక్షన్​ హాళ్ల నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని సూచించారు.

unauthorized function halls should be Siege : Kishan Reddy