- క్లెయిమ్ చేయని బండ్లు వేలం
మల్కాజిగిరి, వెలుగు: మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో పట్టుబడిన, క్లెయిమ్ చేయని 446 పాత వాహనాలను (టూ వీలర్లు, త్రీ వీలర్లు, ఫోర్ వీలర్లు) వేలం వేయనున్నారు. వీటిని అంబర్‌పేట్‌లోని సిటీ ఆర్మ్డ్ రిజర్వు హెడ్‌క్వార్టర్స్‌తో పాటు ఘట్కేసర్ పూలింగ్ పాయింట్లో భద్రపరిచారు. హైదరాబాద్ సిటీ పోలీస్ చట్టం ప్రకారం వీటిని వేలం వేయనున్నారు.
వాహనాల పూర్తి వివరాలు మల్కాజిగిరి పోలీసుల అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. సంబంధిత వాహన యజమానులు తగిన పత్రాలతో ఆరు నెలల లోపు అంబర్‌పేట్‌లోని డీసీపీ సీఏఆర్ హెడ్‌క్వార్టర్స్ కార్యాలయాన్ని సంప్రదించి, తమ వాహనాలను తీసుకెళ్లవచ్చని అధికారులు తెలిపారు. మరిన్ని వివరాలకు 8008338535, 8712662661 నంబర్లలో సంప్రదించవచ్చని సూచించారు.
