ఎమర్జెన్సీ సిగ్నల్.. మేడే కాల్

ఎమర్జెన్సీ సిగ్నల్.. మేడే కాల్

న్యూఢిల్లీ: అహ్మదాబాద్‌‌‌‌లో ఎయిరిండియా ఫ్లైట్‌‌‌‌ క్రాష్‌‌‌‌ కావడానికి ముందు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌‌‌‌ (ఏటీసీ)కు పైలెట్ ‘మేడే కాల్’ చేశారు. కానీ ఆ తర్వాత కమ్యూనికేషన్ కట్ అయింది. కొన్ని క్షణాలకే ప్లేన్ కూలిపోయింది. అసలు ‘మేడే కాల్’ ఏంటంటే.. ఇదొక ఎమర్జెన్సీ కాల్. ఏదైనా ప్రమాదం పొంచి ఉన్నప్పుడు అత్యవసర పరిస్థితుల్లో ఉన్నామని తెలియజేసేందుకు దీన్ని వాడతారు. తాము ఆపదలో ఉన్నామని, తక్షణమే సాయం అందజేయండని చెప్పేందుకు ఇదొక సంకేతం.

ఈ మేడే కాల్‌‌‌‌ను ఫ్లైట్లు, షిప్‌‌‌‌లలోనూ వాడతారు. ఫ్లైట్‌‌‌‌లో అయితే పైలెట్, షిప్‌‌‌‌లో అయితే కెప్టెన్ ‘మేడే కాల్’ చేస్తారు. ఆ టైమ్‌‌‌‌లో మూడుసార్లు మేడే అని చెబుతారు. ఎమర్జెన్సీ ఎదురైనప్పుడు ఫ్లైట్ పైలెట్ రేడియో కమ్యూనికేషన్ ద్వారా ఏటీసీకి మేడే కాల్ చేస్తారు. విమానంలో ఇంజన్ ఫెయిల్యూర్, కంట్రోల్ తప్పడం, మంటలు చెలరేగడం లాంటి ప్రమాదాలు ఎదురైనప్పుడు ఈ కాల్ చేస్తారు. కొన్ని అరుదైన సందర్భాల్లో ప్రమాదంలో చిక్కుకున్న ఫ్లైట్‌‌‌‌ గానీ, షిప్‌‌‌‌ గానీ కమ్యూనికేషన్ కోల్పోయి ‘మేడే కాల్’ చేయలేని పక్షంలో దగ్గర్లోని ఫ్లైట్/షిప్ ‘మేడే కాల్’ చేయవచ్చు. ఈ కాల్‌‌‌‌ అందిన వెంటనే ఫ్లైట్/షిప్ లొకేషన్, ప్రాబ్లమ్‌‌‌‌ ఏంటి, ఇతర వివరాలను ఏటీసీ తెలుసుకుంటుంది. అందుకు అనుగుణంగా రెస్క్యూ చర్యలు చేపడుతుంది. 

ఫ్రెంచ్‌‌‌‌ పదం.. 

‘మేడే కాల్’ అంతర్జాతీయంగా ఏవియేషన్, మారిటైమ్ రంగాల్లో వినియోగిస్తున్న ఎమర్జెన్సీ సిగ్నల్. ఇది ఫ్రెంచ్ పదం ‘మేయిడెర్’ నుంచి వచ్చింది. దీనికి అర్థం ‘సాయం చేయండి’. ఇది 1920 నుంచి వాడకంలోకి వచ్చింది. ఇప్పుడు అంతర్జాతీయంగా స్టాండర్ట్‌‌‌‌ ప్రొటోకాల్‌‌‌‌గా మారింది.