పరిషత్ ఎన్నికల బరిలో నిరుద్యోగులు!

పరిషత్ ఎన్నికల బరిలో నిరుద్యోగులు!

ప్రభుత్వాలు మారుతున్నాయి, నాయకులు మారుతున్నారు కానీ ఉద్యోగాలు మాత్రం రావడం లేదు.ప్రతి పార్టీ ఉద్యోగాలు భర్తీ చేస్తామని, ఉపాధి కల్పిస్తామని హామీలు ఇవ్వడమే తప్ప.. నిరుద్యోగుల పరిస్థితిలో మార్పు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలోనే యువత తమ ఆవేదనను అందరి దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించుకుంది. నిజామాబాద్‌ రైతులను ఆదర్శంగా తీసుకుని.. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల బరిలో నిలిచేందుకు యువతీ యువకులు, నిరుద్యోగులు సిద్ధమవుతున్నారు. ప్రతి జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానంలో వీలైనంత ఎక్కువ మందితో నామినేషన్లు వేయించేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనిపై విస్తృతంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి కే జగిత్యాల, పెద్దపల్లి,నిజామాబాద్‌, నల్గొండ జిల్లాల్లో నిరుద్యోగులు నామినేషన్లు వేయాలని నిర్ణయించుకున్నారు. ఒక్కో స్థానం నుంచి వంద మంది నుంచి 1,000 మంది వరకు నామినేషన్లు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనిపైసోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ మద్దతు కూడగట్టుకుంటున్నారు. ఒకటి రెండు రోజుల్లో జడ్పీటీసీ,ఎంపీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ రానుండటంతోఇది చర్చనీయాంశంగా మారింది.

అన్ని చోట్లా పోటీకి..

రాష్ట్రం లో 535 జడ్పీటీసీ, 5,817 ఎంపీటీసీ సీట్లకు త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎలక్షన్ల కోసం రాజకీయ పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి. క్షేత్రస్థాయిలో పేరున్న నేతలంతా పోటీలో దిగేందుకు ప్రయత్నంచేస్తున్నారు. ఇదే సమయంలో నిరుద్యోగులు, యువతకూడా పెద్ద సంఖ్యలో బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నారు.

ఉద్యోగాలు రాక..

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ ఆకాంక్షల్లో ఉద్యోగాల అంశం కీలకంగా నిలిచింది. విద్యార్థులు, నిరుద్యోగులు ఉద్యమంలో ముందుండి పోరాడారు. కానీ రాష్ట్ర ఏర్పాటు తర్వాతి పరిణామాలతో వారిలో నిరాశ నెలకొంది. తెలంగాణ వచ్చినా నిరుద్యోగ సమస్య తీరలేదని, కనీస స్థాయిలో ఉద్యోగాల భర్తీ జరగ లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగా ల భర్తీకోసం వేసిన కొన్ని నోటిఫికేషన్లు సక్రమంగా లేకపోవడంతో కోర్టుల్లో మురిగిపోతున్నాయి. మరికొన్నింటికి పరీక్షలు నిర్వహించి ఏళ్లు గడుస్తున్నా.. ఫలితాల విడుదల, భర్తీ ప్రక్రియలు జరగలేదు. ఎన్నో శాఖల్లోపెద్ద సంఖ్యలో ఖాళీలు ఉన్నా భర్తీ చేయడంలేదు. నిరుద్యోగులు వేలకు వేలు ఖర్చు పెట్టి కోచింగ్ లు తీసుకుంటున్నారు. ఉద్యోగం లేదని పెళ్లి చేసుకోకుండా ఎదురుచూస్తున్న వారెందరో ఉన్నారు. ఈ నేపథ్యం లోనే ఉద్యోగా ల అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరగాలన్నఆకాంక్ష బలంగా వ్యక్తమవుతోంది.

నిజామాబాద్రైతులే ఆదర్శంగా..

ఇటీవలి లోక్ సభ ఎన్నికల్లో నిజామాబాద్‌ నియోజకవర్గం దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ఎర్రజొన్న,పసుపు పంటలకు మద్దతు ధర అందడం లేదంటూవంద లాది మంది రైతులు నామినేషన్లు వేశారు.ఏకంగా 185 మంది అభ్యర్థులు బరిలో ఉండటం అందరి దృష్టిని ఆకర్షించింది. రైతుల సమస్యలపైఅన్ని పార్టీలు స్పందించాయి. సమస్యను పరిష్కరిస్తా మంటూ పార్టీలు, అభ్యర్థు లు హామీలు ఇచ్చారు.కేంద్ర మంత్రులు సైతం వచ్చి బీజేపీని గెలిపిస్తే సమస్య తీరుస్తామని మాటిచ్చారు. ఈ నేపథ్యంలోనే నిజా-బాద్‌ రైతులను ఆదర్శంగా తీసుకుని, జడ్పీటీసీ,ఎంపీటీసీ ఎలక్షన్లలో పోటీ చేస్తామని నిరుద్యోగులుచెబుతున్నారు.

సోషల్మీడియా వేదికగా..

ఇప్పటి కే కొన్ని జిల్లాల్లో నిరుద్యోగులు సమావేశమై పోటీకి నిర్ణయం తీసుకున్నారు. ఇది రాష్ట్రంలోయువత అందరికీ చేరేలా సోషల్‌ మీడియాను ఉపయోగించుకుంటున్నారు. వాట్సాప్‌, ఫేస్ బుక్‌,ట్విటర్ ల్లో పోస్ట్ లు పెడుతున్నారు. ‘‘తెలంగా ణరాష్ట్రం సాధించినా లాభం లేకుండా పోతోంది. మన సమస్యలను ఏ రాజకీయ పార్టీ పట్టించుకోవడం లేదు.మన సమస్యను మనమే పరిష్కరించుకుందాం. నిజామాబాద్‌ రైతులే ఆదర్శంగా ముందుకెళ్దాం. మీమీప్రాంతాల్లో వీలైనంత ఎక్కువ మంది జడ్పీటీసీ, ఎంపీటీసీగా పోటీ చేయండి.’’అని పిలుపునిస్తున్నారు.యూనివర్సిటీ విద్యార్థులు సైతం తమ జిల్లాల్లో ఈ విషయంపై ప్రచారం చేస్తున్నారు.

ఎన్ని కల నిర్వహణపై ఎఫెక్ట్..

ఒక్కో జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానంలో వందల మందిఅభ్యర్థులు ఉంటే.. అది ఎన్నికల నిర్వహణపై ప్రభావం చూపనుంది. నిజామాబాద్‌ లోక్ సభ సెగ్మెంట్లో 185 మంది అభ్యర్థులు పోటీ చేస్తే.. బ్యాలెట్‌ యూనిట్లు, వీవీ ప్యాట్లు, సిబ్బంది కేటాయింపు, ఏర్పాట్లు వంటి వాటికి చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది.అదే రాష్ట్రం లోని చాలా జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో పెద్ద సంఖ్యలో పోటీలో ఉంటే.. మరింత ఎఫెక్ట్​ కనిపించే అవకాశముంది. భారీ బ్యాలెట్‌ పత్రాలు,పెద్ద బ్యాలెట్‌ బాక్సులు, పోలింగ్ ఏజెంట్లు, పోలింగ్,కౌంటింగ్ లకు ఎక్కువ సమయం తీసుకుంటుంది.ఇదే జరిగితే దేశవ్యాప్తంగా అందరి దృష్టి తెలంగాణపై పడుతుందని, తమ సమస్యలు హైలైట్ అవుతాయని నిరుద్యోగులు భావిస్తున్నారు.

గట్టుప్పల్ నుంచి 200 మంది పోటీ..

నల్లగొండ జిల్లాలోని చండూరు మండలంలోని గట్టుప్పల్ గ్రామస్తులు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో 200నామినేషన్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. జిల్లాలపునర్వ్యవస్థీకరణ సందర్భంగా తొలుత గట్టుప్పల్ను మండలంగా ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. మండల కార్యాలయాలు కూడా సిద్ధం చేశారు.తెల్లారితే అధికారికంగా ఏర్పాటు కావాల్సి ఉండగా ప్రభుత్వం ఆపేసింది. అప్పటినుంచి ఈ గ్రామస్తులుఉద్యమం చేస్తున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో భారీగా పోటీచేసి, నిరసన వ్యక్తం చేయాలని నిర్ణయించారు.