వెటర్నరీ వర్సిటీలో నియామకాలపై నిరుద్యోగుల ఆందోళన

వెటర్నరీ వర్సిటీలో నియామకాలపై నిరుద్యోగుల ఆందోళన

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు : వెటర్నరీ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల నియామకంపై నిరుద్యోగ జేఏసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ ఉద్యోగ నియామకాల్లో రూల్ రోస్టర్ పద్ధతిని పాటించకుండా ఇతరులకు కట్టబెట్టడం సరికాదని నిరుద్యోగ జేఏసీ  ఛైర్మన్ మానవతారాయ్ అన్నారు. సోమవారం రాజేంద్రనగర్ పీవీ వెటర్నరీ వర్సిటీ వీసీ రవీందర్ రెడ్డి చాంబర్ ఎదుట నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ తెచ్చుకున్నది ఆంధ్రవాళ్లకి ఉద్యోగాలు కట్టబెట్టడానికా అని ప్రశ్నించారు. స్థానికేతరులకి ఇచ్చిన ఉద్యోగాలను రద్దు చేయకుంటే ఆమరణ దీక్ష చేస్తామని హెచ్చరించారు. అనంతరం వీసీ రవీందర్‌‌‌‌‌‌‌‌రెడ్డి, రిజిస్ట్రార్‌‌‌‌‌‌‌‌ వీరోజి రావులను కలిసి మెమోరాండం ఇచ్చారు.   కార్యక్రమం లో ఓయూ జేఏసీ చైర్మన్ కొప్పుల ప్రతాప్ రెడ్డి, బండ మధు, శ్రీనివాస్, హరీశ్​ యాదవ్  పాల్గొన్నారు.