టెట్ అప్లికేషన్ గడువు పెంచాలి : నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీల వెంకటేశ్

టెట్ అప్లికేషన్ గడువు పెంచాలి : నిరుద్యోగ జేఏసీ చైర్మన్  నీల వెంకటేశ్

ముషీరాబాద్, వెలుగు: టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(టెట్) పరీక్ష రాయడానికి అప్లికేషన్ గడువును పెంచాలని నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీల వెంకటేశ్​ డిమాండ్ చేశారు. నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో అనంతయ్య అధ్యక్షతన గడువు ను పెంచాలని కోరుతూ టెట్ అభ్యర్థులు, నిరుద్యోగులతో కలిసి ఆదివారం విద్యానగర్ లో నిరసన తెలిపారు. 

ఈ సందర్భంగా నీల వెంకటేశ్​మాట్లాడుతూ.. ఆన్​లైన్​లో అప్లికేషన్ చేసుకోవడానికి 27 వరకు గడువు ఉన్నా సర్వర్ ప్రాబ్లం, టెక్నికల్ ఇష్యూతో చాలామంది అభ్యర్థులు అప్లై చేసుకోలేకపోతున్నారని అన్నారు. టెట్ నోటిఫికేషన్ వేసినట్టు చాలామందికి తెలియదని, తెలిశాక అప్లై చేసుకుందామంటే పేమెంట్ ఆప్షన్ లో ఇబ్బందులు వస్తున్నాయని చెప్పారు. గడువును పెంచి అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరారు.