కళింగ ఇన్​స్టిట్యూట్​కు అవార్డు

కళింగ ఇన్​స్టిట్యూట్​కు అవార్డు

భువనేశ్వర్: ఒడిశా రాజధాని భువనేశ్వర్ లోని కళింగ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్కు ప్రతిష్టాత్మక యునెస్కో అవార్డు దక్కింది. ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన విద్యాసంస్థ అయిన కళింగ ఇన్ స్టిట్యూట్ విద్యారంగంలో సాధించిన ప్రగతికి గుర్తింపుగా ‘యునెస్కో ఇంటర్నేషనల్ లిటరసీ ప్రైజ్ 2022’ను గెలుపొందింది. పశ్చిమాఫ్రికాలోని ఐవరీ కోస్ట్ లో గురువారం ఇంటర్నేషనల్ లిటరసీ డే (సెప్టెంబర్ 8) సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఈ ఇన్ స్టిట్యూట్​కు అవార్డు ప్రదానం చేశారు.

అవార్డు కింద రూ.16 లక్షలు, మెడల్, సైటేషన్ అందజేశారు.  యునెస్కో లిటరసీ ప్రైజ్​ను అందుకున్న తొలి ఒడిశా విద్యా సంస్థగా, ఐదో ఇండియన్ సంస్థగా కళింగ ఇన్ స్టిట్యూట్ నిలిచింది. ఈ అవార్డు అందుకున్న మూడో ఎన్జీవో, తొలి ఇండియన్ ట్రైబల్ ఆర్గనైజేషన్ కూడా ఇదే కావడం విశేషం.