నా కొడుకుపై పడి ఎందుకు ఏడుస్తారు : వెనకేసుకొచ్చిన సీఎం స్టాలిన్

నా కొడుకుపై పడి ఎందుకు ఏడుస్తారు : వెనకేసుకొచ్చిన సీఎం స్టాలిన్

సనాతన ధర్మంపై తమళి మంత్రి ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్న విషయం తెలిసిందే.. సనాతన ధర్మం వ్యతిరేకిస్తున్న వారికి ధీటుగా  సమాధానం ఇవ్వాలని ప్రధాని మోదీ కూడా నిన్న మంత్రివర్గ సమావేశంలో సూచించారు. ప్రధాని వ్యాఖ్యలపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ స్పందిస్తూ.. నా కొడుకు ఉదయనిధి స్టాలిన్ కొందరు టార్గెట్ చేశారు.. వారిలో ప్రధాన మోదీ కూడా చేరిపోయారని విమర్శించారు.

అణచివేత సూత్రాలకు  వ్యతిరేకంగా ఉదయనిధి స్టాలిన్ తీరును తట్టుకోలేకు బీజేపీ అనుకూల శక్తులు తప్పడు కథనాలను ప్రచారం చేశాయని.. ఉదయనిధి స్టాలిన్ ప్రజలను రెచ్చగొట్టారని ప్రధాని మోదీ ఎందుకు అనుకుంటున్నారని స్టాలిన్ అన్నారు. ఉదయనిధి స్టాలిన్ ను టార్గె్ట్ చేసినవారిలో పీఎం మోదీ కూడా చేరారని విమర్శించారు. 

సనాతన ధర్మం భోధించే కొన్ని అమానవీయ సూత్రాల గురించి ఉదయనిధి స్టాలిన్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. షెడ్యూల్డ్ కులాలు, గిరిజనులు, మహిళలపై వివక్ష చూసే సనాతన సూత్రాలపై తన అభిప్రాయం వ్యక్తం చేశారని సీఎం స్టాలిన్ అన్నారు. ఏ మతాన్ని, మత విశ్వాసాలనను కించపరిచే ఉద్దేశం లేదన్నారు ఎంకే స్టాలిన్.
   
బీజేపీ పెంచి పోషిస్టున్న సోషల్ మీడియా గుంపు ఉత్తరాది రాష్ట్రాల్లో అబద్దఆలను విస్తృతంగా ప్రచారం చేసిందని సీఎం స్టాలిన్ అన్నారు. మంత్రి ఉదయనిధి తమిళంలో లేదా ఇంగ్లీషులో జాతి హత్య అనే పదాన్ని ఎప్పుడు ఉపయోగించలేదని అయినప్పటికీ అబద్ధాలు ప్రచారం చేశారని స్టాలిన్ అన్నారు. 

మంత్రివర్గం సమావేశంలో ఉదయనిధి వ్యాఖ్యలపై సరైన స్పందన అవసరమని ప్రధాని అనడం చాలా బాధాకరం.. ఉదయనిధిపై ప్రచారంలో అసత్యాల గురించి  ప్రధాని మోదీ తెలిసి మాట్లాడుతున్నారా.. లేక తెలియక మాట్లాడుతున్నారా అని డీఎం కే అధ్యక్షుడు స్టాలిన్ ప్రశ్నించారు.