మహబూబాబాద్ జిల్లాలో గుప్త నిధుల కోసం మట్టం గుట్టపై తవ్వకాలు

మహబూబాబాద్ జిల్లాలో గుప్త నిధుల కోసం మట్టం గుట్టపై తవ్వకాలు

మహబూబాబాద్,వెలుగు:  జిల్లాలోని  డోర్నకల్ మండలం బూరుగుపాడు గ్రామ శివారులో శనివారం రాత్రి  మట్టం గుట్టపై  గుర్తు తెలియని వ్యక్తులు జేసీబీ సహాయంతో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపారు. గ్రామస్తులు  తెలిపిన వివరాల ప్రకారం పురాతనమైన గుట్టపై అనేక చోట్ల జేసీబీ సహయంతో కందకాలను తవ్వారు. 

ఆదివారం ఉదయం సమయంలో  వ్యవసాయ పనులకు వెళ్లిన రైతులు, మట్టం గుట్టపై, గుప్త నిధులుహ కోసం తవ్వకాలు జరిగినట్టు గుర్తించారు. గుప్త నిధులు తవ్వకాలు వెనుక గ్రామానికి చెందిన కొంతమంది హస్తం ఉన్నట్టుగా స్థానికులు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.