ఇండియాకు యూనిఫామ్ సివిల్ కోడ్ అవసరం..బీజేపీ నేత గూడూరు నారాయణరెడ్డి

ఇండియాకు యూనిఫామ్ సివిల్ కోడ్ అవసరం..బీజేపీ నేత గూడూరు నారాయణరెడ్డి

హైదరాబాద్, వెలుగు: దేశంలోని పౌరులంద రికీ ఒకే చట్టం అమలు చేయడానికి యూని ఫాం సివిల్ కోడ్(యుసీసీ) అవసరమని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గూడూరు నారాయణరెడ్డి అన్నారు. కోడ్ అమలు ఆవశ్య కతపై లా కమిషన్ చర్చను ప్రారంభించింద ని తెలిపారు. దేశంలో ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి మద్దతిచ్చే వారు యుసీసీకి అనుకూలంగా ఉండాలని ఆయన సోమవారం ఒక ప్రకటనలో కోరారు. 

ఇండియా ప్రజాస్వామ్య దేశమైనప్పటికీ, అందరికీ సమాన హక్కులు కల్పిస్తున్నప్పటికీ, వివిధ మతాల వ్యక్తిగత చట్టాలు ఈ ప్రయోజ నాన్ని నిర్వీర్యం చేస్తున్నాయన్నారు. కొన్ని మ తాల్లో  స్త్రీలను అణచివేసేందుకు చట్టాలను ఉపయోగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ఏ మతానికి ఉన్నత హోదా ఇవ్వలేదని, అన్ని మతాలు సమానమేనని చెప్పారు.