కోట్లు ఇచ్చే యాడ్ వదులుకున్న నటి..ఎందుకో తెలుసా

 కోట్లు ఇచ్చే యాడ్ వదులుకున్న నటి..ఎందుకో తెలుసా

సీనియర్ నటి, రాజకీయ నేత కేంద్రమంత్రి స్మ్రతి ఇరానీ..బీజేపీలో ఉన్న లేడీ ఫైర్ బ్రాండ్ నేతల్లో ఒకరు. తాజాగా యూట్యూబర్ రణ్‌వీర్ అల్లాబాడియాతో ఇంటర్వ్యూ లో తాను పంచుకున్న ఓ విషయం ఆసక్తికరంగా మారింది. 

''కెరీర్ ఆరంభంలో సరిగా డబ్బులు ఉండేవి కావు. బ్యాంక్ అకౌంట్లో రూ.పాతిక వేలకు మించి ఉండేవి కావు. పెళ్లైన కొత్తల్లో రూ.25-27 లక్షల అప్పు తీసుకొని ఇంటిని కొన్నా. ప్రతి నెలా చెల్లించాల్సిన ఈఎంఐకు బోలెడన్ని తిప్పలు పడాల్సి వచ్చేది.'' అని పేర్కొన్నారు.

అలాంటి టైంలో ఒక పాన్ మసాలా యాడ్ చేయాలని.. అందుకు కోట్లాది రూపాయిలు రెమ్యునరేషన్ ఇస్తామని ఆఫర్ చేశారట. కానీ చేసే యాడ్  అనేది "కుటుంబాలు చూస్తారని, యువకులు చూస్తున్నారని నాకు తెలుసు. అలా నేను కుడా ఒక కుటుంబంలో భాగం కాబట్టి మనస్సాక్షిగా నో చెప్పాను. ఆల్కహాల్ కంపెనీలు అమ్మే ఆ నీళ్లు, ఫ్లేవర్ వాటర్స్ అన్నీటికీ నేను నో చెప్పాను. ఎందుకంటే ఏదో ఒక రోజు నా  పిల్లలు నేను చేసే సినిమాలైనా, సీరియళ్లయినా చూస్తారని నాకు తెలుసు. అందుకే నో చెప్పినట్లుగా గుర్తు చేసుకున్నారు కేంద్రమంత్రి స్మ్రతి ఇరానీ. 

స్మ్రతి ఇరానీ తీసుకున్న ఈ  ఒక్క నిర్ణయంపై తన పట్ల మరింత గౌరవం పెరుగుతోంది అంటూ నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. డబ్బుల కోసం ఎలాంటి యాడ్ అయినా చేసే వాళ్ళు చాలానే ఉంటారు. కానీ సమాజం పట్ల, యువత పట్ల ఆలోచనతో తీసుకున్న ఈ నిర్ణయం..తనకున్న ముందు చూపుకు దక్కిన గౌరవం. కనుకే ఒక గొప్ప రాజకీయ నాయకురాలిగా, కేంద్ర మంత్రిగా నిలిపిందని తెలుస్తోంది.  

టీవీ నటులకు అత్యుత్తమ అవార్డుగా భావించే ఇండియన్ టెలివిజన్ అకాడమీ అవార్డును వరసగా ఐదు సార్లు అందుకుని చరిత్ర సృష్టించింది స్మ్రతి ఇరానీ. తరువాత సొంతంగా ఉగ్రాన్య ప్రొడక్షన్స్ పేరుతో నిర్మాణ సంస్థ నెలకొల్పి పలు  టీవీ సీరియల్స్ నిర్మించింది.