రాష్ట్ర ప్రభుత్వ ప్రతి స్కీంలో కేంద్రం వాటా 

రాష్ట్ర ప్రభుత్వ ప్రతి స్కీంలో కేంద్రం వాటా 

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి స్కీంలోనూ కేంద్రం వాటా ఉందని కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ... రాష్ట్రం వాటా ఇచ్చిన మరుక్షణంలోనే కేంద్రం వాటా రిలీజ్ చేస్తున్నామన్నారు. అలాంటప్పుడు కేంద్రం వాటా ఉందని చెప్పడానికి రాష్ట్ర ప్రభుత్వానికున్న అభ్యంతరం ఏంటని ప్రశ్నించారు. కేంద్రం వాటా ఉన్న స్కీంకు కేంద్రం పేరు పెట్టాల్సిందేనని డిమాండ్ చేశారు. అప్పులు తెచ్చి స్కీంలు అమలు చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడానికి తమకెలాంటి సంబంధం లేదన్నారు. జనం సమస్యలు తెలుసుకోవడానికి పార్లమెంట్ ప్రవాస్ యోజన ప్రవేశపెట్టామని, రైతు సమస్యలపై ప్రత్యేక ఫోకస్ పెట్టామని మంత్రి వెల్లడించారు. జిల్లాలో పర్యటించడం వల్ల చాలా విషయాలు తెలుసుకున్నానని మంత్రి చెప్పారు.

కేంద్ర మంత్రిగా తాను అడిగిన ప్రశ్నలకు కలెక్టర్ సమాధానం చెప్పలేదని కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ట్యాక్స్ పేయర్స్ కట్టే ఒక్క రూపాయిని కూడా వేస్ట్ కానివ్వబోమని నిర్మలా సీతారామన్ తెలిపారు. తన వ్యాఖ్యలను  రాష్ట్ర మంత్రి హరీశ్ రావు వక్రీకరించారని, మంత్రి స్థాయిలో ఉన్న హరీశ్ రావు ప్రెస్ కాన్ఫరెన్స్ లో తానేం మాట్లాడానో విని మాట్లాడితే బాగుండేదని విమర్శించారు.